మోస్ట్ వైలెంట్ దర్శకుడితో ప్రభాస్ సినిమా..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రాజాసాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ప్రభాస్. కానీ ఈ మూవీ ఆశించినంత విజయం సాధించలేకపోయింది. ఫస్ట్ డే కలెక్షన్స్ భారీగానే వచ్చినప్పటికీ ప్లాఫ్ టాక్ కారణంగా వసూల్లు తగ్గుముఖం పట్టాయి. ఈ మూవీ తర్వాత ఇప్పుడు ప్రభాస్ ఫౌజీ, స్పిరిట్ చిత్రాలతో బిజీగా ఉన్నారు. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ 2, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2 చిత్రాలు కూడా చేయాల్సి ఉంది. అయితే ఇప్పుడు మరో సినిమాకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మలయాళ దర్శకుడితో ప్రభాస్ సినిమా చేస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. ఆ దర్శకుడు ఎవరో కాదు.. ఇటీవల మార్కో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు.

ఉన్ని ముకుందన్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ గతేడాది ఎవ్వ‌రూ ఊహించ‌ని స్థాయిలో భారీ హిట్ అయింది. తెలుగులో జ‌న‌తా గ్యారేజ్, భాగ‌మ‌తి లాంటి చిత్రాల్లో క్యారెక్ట‌ర్ రోల్స్ చేసిన ఉన్ని ముకుందన్ ఇందులో ఫుల్ టైమ్ హీరోగా కనిపించారు. ఈ మూవీలోని వ‌యొలెన్స్‌ సీన్స్ ఇప్పటికీ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. అందుకే అప్పట్లో ఈ మూవీని యూత్ ఎగ‌బ‌డి చూశారు. ఎక్కువ‌గా సున్నిత‌మైన సినిమాలు తీసే మాలీవుడ్‌ లో ఇలాంటి సినిమా రావ‌డం.. అది కూడా అంత పెద్ద విజ‌యం ద‌క్క‌డం ఆశ్చ‌ర్యకరమైన విషయమనే చెప్పాలి. ఇక ఈ చిత్రానికి హనీఫ్ అదేని దర్శకత్వం వహించారు. అయితే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ చిత్ర దర్శకుడితో ఓ సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది.

prabhas Marco movie director Haneef Adeni is planning to make movie with pan india star prabhas

ఇక రా అండ్ రస్టిక్ యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా పేరుగాంచిన హనీఫ్ వినిపించిన ఒక పవర్‌ఫుల్ లైన్‌ ప్రభాస్ కూ విపరీతంగా నచ్చిందట. ఆయన ఈ సినిమాపై పాజిటివ్ గా స్పందించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఇక ఈ మూవీని టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నట్లు సమాచారం. ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా అంతర్జాతీయ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు దిల్ రాజు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ 2028 లో ప్రారంభమై 2029 లో రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. మరి ఈ క్రేజీ కాంబో విషయంలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+