రూ. 2 కోట్లతో తీస్తే.. రూ. 155 కోట్లు వచ్చాయి.. సడెన్ గా ఓటీటీలోకి లేటెస్ట్ బ్లాక్ బస్టర్..!

ప్రస్తుతం చిన్న సినిమాలదే హవా కొనసాగుతోంది. కంటెంట్ ఉన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద రచ్చ రచ్చ చేస్తున్నాయి. భారీ బడ్జెట్ తో పెద్ద పెద్ద హీరోలు చేస్తున్న సినిమాలపై భారీ అంచనాలు ఉన్న కారణంగా అవి రిలీజ్ రోజు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అవుతున్నాయి. అయితే అదే సమయంలో చిన్న సినిమాలు సైలెంట్ గా వచ్చి సూపర్ సక్సెస్ అవుతున్నాయి.

ఇటీవలికాలంలో ఇలా అనేక చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. వాటిలో ఒకటి కన్నడ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ 'ప్రేమద ఊరలి'.. కేవలం రూ. 2 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలోకి అడుగుపెట్టింది. అయితే కేవలం మౌత్ టాక్ తోనే బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ప్రభంజనం సృష్టించింది.

కన్నడ ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. దాంతో ఈ మూవీ ఏకంగా రూ. 155 కోట్ల వసూళ్లను దక్కించుకుంది. కేవలం రూ. 2 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 150 కోట్లకుపైగా కలెక్షన్స్ ను రాబట్టడం మామూలు విషయం కాదని పలువురు మాట్లాడుకుంటున్నారు. అలాగే ఈ మూవీ క‌న్న‌డలో అత్యధిక క‌లెక్ష‌న్స్ రాబట్టిన చిత్రంగా చరిత్ర సృష్టించడం విశేషం. అయితే థియేటర్లలో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ఈ మూవీ ఇప్పుడు సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసింది. మంగ‌ళ‌వారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో క‌న్న‌డంతో పాటు తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది.

PremadaOorali The Kannada blockbuster movie arrived on OTT it is now streaming on AmazonPrimeVideo

ఇక ప్రేమ‌దా ఊర‌లి సినిమాలో శ్రీరామ్‌, త‌ప‌స్విని పూనాచా హీరోహీరోయిన్లుగా న‌టించారు. అలాగే ర‌మిక శివు, రంగాయ‌న ర‌ఘు కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ చిత్రానికి మ‌నోజ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇక తండ్రీకొడుకుల అనుబంధంతో ద‌ర్శ‌కుడు ఈ చిత్రాన్ని మలిచారు. అయితే ఈ మూవీ ప్రేమనే ఊరిలో అనే పేరుతో తెలుగులోనూ డబ్ అయింది. కానీ ఇక్కడ ప్రేక్షకులు ఈ సినిమాలు పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు ఓటీటీలో ఈ మూవీని చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+