మరో హిట్ గ్యారంటీ .. కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న హీరో
టాలీవుడ్‌లో విలక్షణమైన పాత్రలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రియదర్శి. ఆయన కథానాయకుడిగా, మలయాళ ముద్దుగుమ్మ ద్రిషిక చందర్ హీరోయిన్‌గా నటిస్తున్న తాజా చిత్రం 'సుయోధన'. ఈ సినిమా ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. సమ్మర్ సీజన్‌ను టార్గెట్ చేస్తూ, ఈ చిత్రాన్ని మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
ప్రజ్వలా లైన్ క్రియేషన్స్ బ్యానర్‌పై వై.ఎస్. మాధవ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని బోసుబాబు నిడుమోలు నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ 'సుయోధన' అని పెట్టడం నుండే ప్రేక్షకుల్లో ఒక రకమైన క్యూరియాసిటీ నెలకొంది. ఇందులో ప్రియదర్శి నటన హైలైట్‌గా నిలవనుందని మేకర్స్ చెబుతున్నారు.

ఈ సినిమాలో కేవలం ప్రియదర్శి మాత్రమే కాకుండా, వెండితెరపై తన గంభీరమైన కంఠంతో అలరించే డైలాగ్ కింగ్ సాయికుమార్, ఒకప్పటి స్టార్ హీరోయిన్ ప్రేమ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వీరిద్దరి కలయిక సినిమాకు పెద్ద అసెట్ కానుంది. అలాగే లడ్డు విష్ణు, దేవి ప్రసాద్, రాజశ్రీ నాయర్ వంటి అనుభవం ఉన్న నటులు కూడా ఈ సినిమాలో భాగం కావడం విశేషం.జై క్రిష్ సంగీత సారథ్యంలో రామజోగయ్య శాస్త్రి కలం నుంచి జాలువారిన సాహిత్యం ప్రేక్షకులను అలరించబోతోంది.కార్తీక్ కొప్పెర సినిమాటోగ్రఫీ సినిమాకు రిచ్ లుక్ తీసుకురాగా, ఛోటా కె ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. బ్రహ్మ కడలి తన కళా నైపుణ్యంతో సినిమా సెట్స్ ను అద్భుతంగా తీర్చిదిద్దారు.
రిలీజ్ డేట్ పోస్టర్ విడుదల చేసిన సందర్భంగా నిర్మాత బోసుబాబు నిడుమోలు మాట్లాడుతూ.. "మంచి కథ, కథనాలతో అత్యుత్తమ ప్రమాణాలతో సుయోధన చిత్రాన్ని నిర్మించాం. ప్రియదర్శి, సాయికుమార్ ల నటన అద్భుతంగా ఉంటుంది. మార్చి 27న ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకువస్తున్నాం. త్వరలోనే టీజర్, ట్రైలర్ , పాటలను విడుదల చేస్తాం" అని ధీమా వ్యక్తం చేశారు.ప్రముఖ పంపిణీ సంస్థ శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా ఈ సినిమా భారీ ఎత్తున థియేటర్లలోకి రానుంది. ప్రియదర్శి క్రేజ్, సాయికుమార్-ప్రేమల సీనియారిటీ తోడవ్వడంతో 'సుయోధన' బాక్సాఫీస్ వద్ద మంచి సందడి చేసేలా కనిపిస్తోంది.మరి ఈ 'సుయోధన' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలంటే మార్చి 27 వరకు వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications