హరిహర వీరమల్లులో అనాథగా పవన్ కళ్యాణ్.. స్టొరీ లీక్ చేసిన నిర్మాత !
టాలీవుడ్ పవర్‌స్టార్, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్.. కొంచెం గ్యాప్ తర్వాత మళ్లీ ప్రేక్షకులను అలరించనున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రాల్లో 'హరి హర వీరమల్లు' కూడా ఒకటి. ఈ మూవీకి జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించగా.. తొలి భాగం " స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ " పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్ కెరీర్‌లోనే మొట్టమొదటి పాన్ ఇండియా సినిమాగా రాబోతుంది. పవన్ రాజకీయ బిజీ షెడ్యూల్, విఎఫ్ఎక్స్ పనుల జాప్యం వల్ల సినిమా సుమారు 14 సార్లు వాయిదా పడింది. అది కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ రికార్డే!. ఎట్టకేలకు జూలై 24న విడుదలకు సిద్ధమైంది.
ఈ పీరియాడిక్ డ్రామాకు మొదట క్రిష్ జగర్లమూడి దర్శకత్వం వహించగా, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన సినిమా నుంచి తప్పుకున్నారు. తర్వాత జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు తీసుకొని సినిమా పూర్తిచేశారు. ఏఎం రత్నం నిర్మాతగా వ్యవహరించిన ఈ మూవీని భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా, ప్రముఖ నటులు అనుపమ్ ఖేర్, బాబీ దేవోల్, సునీల్, నాజర్, కబీర్ సింగ్, సుబ్బరాజు, నోరా ఫతేహి, విక్రమ్ జీత్, జిషు సెన్‌గుప్తా కీలక పాత్రలు పోషించారు. ఈ గ్రాండ్ ప్రాజెక్ట్‌కు ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నారు.

వీరమల్లు - సనాతన ధర్మ రక్షకుడా?
సినిమా రిలీజ్ దగ్గర పడడంతో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది మూవీ యూనిట్. లేటెస్ట్ గా ఇచిన ఇంటర్వ్యూలో నిర్మాత ఏఎం రత్నం సినిమాకు సంబంధించి పలు కీలక విషయాలను రివీల్ చేశారు. ఈ సినిమా పూర్తిగా కల్పిత కథపై ఆధారపడి రూపొందించబడిందని, ఏ వ్యక్తిని గానీ, వర్గాన్ని గానీ ఉద్దేశించి చేయలేదని స్పష్టంగా తెలిపారు. పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో ఒక అనాథ పాత్రలో కనిపించబోతున్నారని వ్యాఖ్యానించడంతో ఈ విషయం తెలుగు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
స్టొరీ లీక్..
వర్షకాలంలో వరదల్లో కొట్టుకు వచ్చిన ఒక చిన్నారి ఆలయంలో పెరిగి, పెద్దయ్యాక సనాతన ధర్మాన్ని కాపాడే యోధుడిగా మారతాడు. ఆ పాత్ర ఔరంగజేబు కాలంలో సనాతన ధర్మాన్ని రక్షించే దిశగా సాగుతుందనీ.. ఇది భక్తి, శక్తి కలగలిపిన దైవిక క్యారెక్టర్ అని రత్నం తెలిపారు. అంతే కాకుండా పవన్ నిజ జీవిత లక్ష్యాలకూ కూడా ఇది సరిపోతుందని పేర్కొన్నారు. రాజకీయంగా కూడా పవన్ సనాతన ధర్మానికి పోరాటం చేస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నారని అన్నారు.
మరోవైపు అయితే ఈ సినిమాలో పవన్ పాత్రను తెలంగాణ పోరాట యోధుడు పండుగ సాయన్న ఆధారంగా తీర్చిదిద్దారని బీసీ సంఘాల నేతలు పలువురు ఆరోపించారు. ఇది సాయన్న పేరును అపకీర్తి తెస్తుందని.. సినిమా విడుదలను అడ్డుకుంటామంటూ బహిరంగంగా హెచ్చరించారు. ఇప్పుడు రత్నం క్లారిటీ ఇవ్వడంతో ఈ విషయం ఇక్కడితో ముగిసిపోతుందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications