చిరంజీవి సినిమాకు వార్నింగ్ ఇచ్చిన అశ్వనీదత్
వైజయంతీ మూవీస్ పతాకంపై చలసాని అశ్వనీదత్ తీసిన బ్లాక్ బస్టర్ సినిమాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఆ సినిమాలన్నీ ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి. ముఖ్యంగా జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమాకు ప్రత్యేకస్థానం ఉంటుంది. ఈ సినిమాకు రెండో భాగం తీస్తామని, సీక్వెల్ ఆలోచనలు ఉన్నాయంటూ అశ్వనీదత్ ఎన్నోసార్లు వెల్లడించారు.
రామ్ చరణ్ - జాన్వీకపూర్ తో తీయబోతున్నారంటూ గాసిప్స్ కూడా వచ్చాయి. అయితే అవేవీ కార్యరూపం దాల్చలేదు. తాజాగా వైజయంతీ మూవీస్ ఓ చిత్రానికి వార్నింగ్ నోటీస్ ఇచ్చినట్లుగా సోషల్ మీడియాలో వార్త వైరల్ గా మారింది. జగదేవక వీరుడు అతిలోక సుందరి కాపీరైట్స్ తమ దగ్గరే ఉన్నాయని, ఆ సినిమాకు సంబంధించి ఏ చిన్న విషయాన్ని ఉపయోగించుకున్నా న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

విజువల్స్, క్యారెక్టర్స్, సినిమాకు సంబంధించిన కథ, సీక్వెల్, ప్రీక్వెల్.. ఇలా ఎవరు వాడుకున్నా చర్యలు తప్పవన్నారు. అన్నిరకాల హక్కులు తమకే చెందుతాయంటూ నోటీసులో పేర్కొన్నారు. అయితే ఈ వార్నింగ్ మాత్రం చిరంజీవి-వశిష్ట కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న చిత్రం గురించే అని చర్చలు నడుస్తున్నాయి. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాకు, జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రానికి లింక్ ఉందంటున్నారు.
దీంతో అశ్వనీదత్ ఇలా నోటీసులివ్వడంద్వారా తన జాగ్రత్తలో తానున్నాడంటున్నారు. తమకు తెలియకుండా, తమనుంచి అనుమతులు తీసుకోకుండా ఎవరైనా ముందుకే వెళితే చర్యలు తప్పవని హెచ్చరించినట్లుగా భావిస్తున్నారు. అశ్వనీదత్ ఇచ్చిన ఆ వార్నింగ్ ఎవరి గురించి? ఏ సినిమా గురించి అన్నది మాత్రం స్పష్టత రావడంలేదు. అయితే అశ్వనీదత్ అధికారికంగా ఈ విషయాన్ని చెబుతారేమోనని సినీజనాలు ఎదురు చూస్తున్నారు.












Click it and Unblock the Notifications