టాలీవుడ్ లో రాజకీయ రొచ్చు- స్టార్ ప్రొడ్యూసర్ షాకింగ్
థియేటర్ల బంద్ వ్యవహారం రోజురోజుకూ ముదురుతోంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు, కమల్ హాసన్- మణిరత్నం కాంబోలోని హైబడ్జెట్ మూవీ థగ్స్ లైఫ్ సినిమాలు విడుదల కాబోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎగ్జిబిటర్లు బంద్ కు పిలుపునివ్వడం వివాదాస్పదమైంది.
దీనిపై ఇప్పటికే పవన్ కల్యాణ్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పందించారు. సినిమా రంగానికి పరిశ్రమ హోదా ఇవ్వడానికి ప్రయత్నిస్తోన్న పవన్ కల్యాణ్ కు టాలీవుడ్ కు చెందిన కొందరు ప్రముఖులు రిటర్న్ గిఫ్ట్ ను కూడా తగిన విధంగానే స్వీకరించాలని నిర్ణయించుకున్నారు.

ఇక నుంచి వ్యక్తిగత విజ్ఞాపనలు, చర్చలకు తావులేదని, సంబంధిత విభాగం ప్రతినిధులతోనే చర్చిస్తారని ఉప ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పర్యటక రంగానికి పరిశ్రమ హోదా ఇస్తూ పాలసీని ప్రకటించిందని, అదే విధంగా సినిమా రంగం అభివృద్ధి కోసం ప్రత్యేక పాలసీ తీసుకురావాలని పవన్ కల్యాణ్ భావించారని వివరించింది.
థియేటర్లను సంబంధిత యజమానులు నడపటం లేదని, లీజుదారుల చేతిలోనే అత్యధికంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. అయితే లీజుదారుల నుంచి పన్ను సక్రమంగా వస్తుందా లేదా? వివిధ చిత్రాలకు ధరలు పెంచినప్పుడు ఆ మేరకు పన్ను ఆదాయం పెరిగిందా లేదా అని కూడా పన్నుల విభాగం పరిశీలన చేయాలని దిశానిర్దేశం చేశారు.
రాయలసీమ జిల్లాల్లో థియేటర్ల నుంచి వచ్చే ఆదాయంపైనా ఈ సందర్భంగా చర్చించారు. టికెట్ సేల్ కీ, వచ్చే పన్నుకీ అంతరం ఏ మేరకు ఉందో చూడాలని నిర్ణయించారు. అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సినిమా హాళ్లలో పారిశుధ్య పరిస్థితులను కూడా స్థానిక సంస్థల ద్వారా పర్యవేక్షించనున్నారు.
రాష్ట్రంలో మల్టీప్లెక్స్ స్థాయి సినిమా హాల్స్ ఎన్ని ఉన్నాయో తెలియచేయాలని ఇప్పటికే సినిమాటోగ్రఫీ శాఖ అధికారులను నివేదిక అడిగింది. కొన్ని పట్టణాల్లో సింగిల్ థియేటర్లను కూడా రెండుమూడు స్క్రీన్స్ గా విభజించి మల్టీప్లెక్స్ విధానంలో నడుపుతున్నారు. వాటిలో టికెట్ ధరలు, సింగిల్ థియేటర్ టికెట్ ధరలకు ఏమైనా వ్యత్యాసం ఉందా? కౌంటర్ లో ఏ ధరకు అమ్ముతున్నారో ఆరా తీస్తున్నారు.
విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, రాజమహేంద్రవరం, గుంటూరు, కాకినాడ, తిరుపతి తదితర నగరాల్లో ఉన్న మల్టీప్లెక్స్ ల నిర్వహణ వాటిలోని టికెట్ ధరలు, ఆహార పదార్థాల ధరలపై కూడా దృష్టి సారిస్తారు. ఈ అంశాలపై పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తోపాటు హోం, వాణిజ్య పన్నులు, రెవెన్యూ శాఖల మంత్రులతో త్వరలో చర్చిస్తారు.
ఈ పరిణామాలపై ప్రముఖ నిర్మాత బన్నీ వాసు స్పందించారు. ఎగ్జిబిటర్లు థియేటర్ల బంద్ కు పిలుపునివ్వడాన్ని పరోక్షంగా తప్పుపట్టారు. అదే సమయంలో టాలీవుడ్ పైనా వ్యాఖ్యలు చేశారు. సినిమా ఇండస్ట్రీలో రాజకీయాలు చొచ్చుకొచ్చాయని, చాలా లోతుగా పాతుకుపోయాయని అన్నారు.
సినిమా ఇండస్ట్రీలో రాజకీయాలు చాలా సైలెంట్ గా ఉంటాయని బన్నీ వాసు అన్నారు. అలాగే చాలా లోతుగానూ ఉంటాయిని వ్యాఖ్యానించారు. ఈ రాజకీయాల రొచ్చులో ఇండస్ట్రీ నలుగుతుంది అనేది ఇప్పటికైనా సరే.. ప్రొడ్యూసర్స్ గానీ.. డిస్ట్రిబ్యూటర్స్ కానీ.. ఎగ్జిబిటర్స్ కానీ గ్రహించాలని హితవు పలికారు.
ఇలాంటి సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్లి ఒకరు ఉప ముఖ్యమంత్రి అయిన వాళ్ళనే మనం ఇరిటేట్ చేశామంటే.. మన యూనిటీ ఎలా ఉంది అని ప్రశ్నించుకునే సమయం వచ్చిందని బన్నీ వాసు వ్యాఖ్యానించారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఐక్యత లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
-
ఒక్క వెబ్ సిరీస్ తోనే పిచ్చెక్కించే షాక్ ఇచ్చిన బ్యూటీ.. -
బండ్ల గణేష్ ఇంట పెళ్లి సందడి.. కాబోయే అల్లుడు అతనే ?? -
మధ్యతరగతి మనుషుల ఎమోషనల్ జర్నీ -
పెళ్లయిన నెల రోజులకే రష్మిక గుడ్ న్యూస్..? ముగ్గురం అయ్యామంటూ పోస్ట్ వైరల్.. -
'బైకర్' మూవీ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్.. 2 నెలల్లో 2 హిట్లు నీకే సాధ్యం అన్నా..! -
తెలుగులో తొలి ఏఐ సినిమా! -
చెప్పుతో పాటు ఆ సింబల్ చూపించిన స్టార్ బ్యూటీ.. కారణం అదే ??? -
రిలీజ్‌కి ముందే ప్రీ రిలీజ్ బిజినెస్‌తో రికార్డ్.. చిన్న సినిమా కాదయ్యో !! -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
ఇండస్ట్రీలో ఉండాలంటే కమిట్మెంట్ కు ఒప్పుకోవాల్సిందే: నటి సంచలన కామెంట్స్ వైరల్ -
టాలీవుడ్ vs పొలిటీషియన్స్: డ్రగ్స్ టెస్ట్ రచ్చ! -
అద్దె పోయి వాటా వచ్చింది. సింగిల్ స్క్రీన్స్‌లో మల్టీప్లెక్స్ రూల్స్










Click it and Unblock the Notifications