'ఎపిక్' ముద్దు సీన్‌ వివాదం.. నిర్మాత నాగ వంశీ షాకింగ్ కామెంట్స్!

యువ కథానాయకుడు ఆనంద్ దేవరకొండ, వైష్టవి చైతన్య జంటగా నటించిన 'ఎపిక్' సినిమాలోని ఓ ముద్దు సీన్ చుట్టూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ, ట్రోలింగ్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా నిర్మాత సూర్యదేవర నాగ వంశీ ఈ వివాదంపై స్పందించారు. కేవలం ఒక్క ముద్దు సన్నివేశాన్ని మాత్రమే పట్టుకుని, సినిమా మొత్తాన్ని అంచనా వేయవద్దని ఆయన ప్రేక్షకులు, నెటిజన్లను కోరారు. ఈ సినిమాలో అంతకు మించి ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉందని నాగ వంశీ తెలిపారు.

Kaaka Movie: 'కాకా’లో చిరంజీవికి ఈమెనే స్పెషల్..!
Kaaka Movie: 'కాకా’లో చిరంజీవికి ఈమెనే స్పెషల్..!

ప్రతి ఒక్కరి జీవితంలో ఓ అమ్మాయిని కలవడం, ప్రేమించడం సాధారణమని.. అవి సినిమాటిక్‌గా చూపించడంలో తప్పులేదని ఆయన అన్నారు. ఓ అమ్మాయి, అబ్బాయి మధ్య ఉండే బంధాన్ని, వారి సంబంధాన్ని ఎంత స్వచ్ఛంగగా, ప్యూర్ గా చూపించారో సినిమా చూస్తే తెలుస్తుందని నిర్మాత నాగ వంశీ పేర్కొన్నారు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యల మధ్య ఉండే బంధమే ఈ కథకు ప్రధాన బలమని ఆయన తెలిపారు. అంతేకాకుండా ఈ సినిమాను కుటుంబసమేతంగా చూసి ఆస్వాదించవచ్చని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ట్రైలర్లో కనిపించిన ముద్దు సీన్ ఆధారంగా సినిమాను అడల్ట్ ఫిల్మ్‌గా భావించవద్దని ప్రేక్షకులను కోరారు. 2 గంటల 20 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రంలో దాదాపు గంటా 40 నిమిషాలు వైష్ణవి, ఆనంద్ మాట్లాడుకుంటూ ఉండారని నాగ వంశీ తెలిపారు.

Producer Naga Vamsi Comments on EPIC Movie Kissing Scene Controversy asking audiences to focus on the story

తెలంగాణ ప్రాంతం నుంచి కాన్ఫిడెన్స్ తక్కువ ఉన్న కుర్రాడు, కాన్ఫిడెంట్ ఉన్న అమ్మాయి ప్రేమలో పడితే బంధం ఎలా ఉంటుందో ఈ సినిమాలో చక్కగా చూపించారని నాగ వంశీ పేర్కొన్నారు. ఆర్థిక నేపథ్యం ఆధారంగా సంబంధాలు ఎలా ప్రభావితమవుతాయో కూడా సినిమాలో ఉంటుందని వెల్లడించారు. అలాగే తనకు రొమాంటిక్ కామెడీ సినిమాలు, కుటుంబ కథా సినిమాలు ఇష్టమైన జానర్ అంటూ పేర్కొన్నారు. ప్రేమించుకునే జంటలు ఈ చిత్రంతో తప్పకుండా కనెక్ట్ అవుతారని ఆయన వెల్లడించారు.

EPIC – First Semester First Review: 'ఎపిక్‌ - ఫస్ట్‌ సెమిస్టర్‌' మూవీ ఫస్ట్ రివ్యూ ఇదే..
EPIC – First Semester First Review: 'ఎపిక్‌ - ఫస్ట్‌ సెమిస్టర్‌' మూవీ ఫస్ట్ రివ్యూ ఇదే..

మరోవైపు ఈ సినిమా డైరెక్టర్ ఆదిత్య హాసన్ గతంలో "#90s" వెబ్ సిరీస్ తో ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ ఎపిక్ సినిమాతో ఆయన లివ్-ఇన్-రిలేషన్ షిప్, దంపతుల మధ్య సాన్నిహిత్యం, అందులోని కష్టాలు వంటి కాస్త పరిణతి చెందిన అంశాలను స్పృశిస్తూ కొత్త లీ‌గ్‌లోకి అడుగుపెడుతున్నారు. కేవలం ముద్దు సన్నివేశం మాత్రమే ప్రచారంలో నిలిచినప్పటికీ.. ఆ వివాదానికి అతీతంగా ప్రేక్షకులు సినిమాలోని అసలు కథను ఇష్టపడతారని సినీ మేకర్స్ ఆశిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+