గన్నవరం విమానాశ్రయం ఇక నుంచి - కేంద్రం కీలక ప్రకటన..!!

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన చేసారు. ఏపీలో భోగాపురం విమానా శ్రయం ప్రారంభం తరువాత గన్నవరం విమానాశ్రయం పైన కొత్త చర్చ మొదలైంది. ఏపీలో రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఒకటిగా ఉన్న గన్నవరం విస్తరణ చేపట్టాలని డిమాండ్ పెరిగింది. ఏపీ ప్రభుత్వం సైతం ఈ విమానాశ్రయం పైన కేంద్రానికి కీలక ప్రతిపాదనలు అందించింది. దీంతో.. కేంద్రం ఇప్పుడు ఈ ఏయిర్ పోర్టు పైన తమ ప్రణాళికలను వెల్లడించింది.

గన్నవరం విమానాశ్రయంలో కొత్త నిర్మాణాల పైన కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక విషయాలను వివరించారు. తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణం జరుగుతోందని చెప్పారు. విజయవాడ ఎయిర్‌పోర్ట్‌ను సందర్శించిన మంత్రి అక్కడ కొనసాగుతున్న ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణ పనులను పరిశీలన చేసారు. అధికారులు నిర్మాణ పనుల ప్రగతిని కేంద్ర మంత్రికి వివరించారు. మంత్రి పలు కీలక సూచనలు చేసారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ పనులు త్వరగా పూర్తిచేయాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. గతంలో కాంట్రాక్టర్ కారణంగా నిర్మాణ పనుల్లో జాప్యం జరిగిందని, ఇప్పుడు కొత్త కాంట్రాక్టర్‌ను ఏర్పాటుచేసి పనులను వేగవంతం చేస్తున్నామని వివరించారు.

కేంద్ర కేబినెట్ లోకి డీఎంకే..? వీరికి ఉద్వాసన: ఏపీ..తెలంగాణ నుంచి ఇన్..ఔట్..!!
కేంద్ర కేబినెట్ లోకి డీఎంకే..? వీరికి ఉద్వాసన: ఏపీ..తెలంగాణ నుంచి ఇన్..ఔట్..!!
minister-k-ram-mohan-naidu-directs-aai-to-finish-vijayawada-airports-new-integrated-terminal-by-oct

కేంద్రం తాజా నిర్ణయంతో

కాగా.. పలు సమస్యలు ఎదురైనా వాటిని అధిగమించి పనులను కొనసాగిస్తున్నామని వివరించారు. సీఎం చంద్రబాబు సూచనలను పరిగణలోకి తీసుకున్నామని చెప్పారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ తరహాలో కల్చరల్ ఎలిమెంట్స్‌కు ప్రాధాన్యమిస్తున్నామని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. తెలుగు ప్రజల సంస్కృతితో అనుసంధానం చేస్తూ.. కృష్ణానది, దుర్గమ్మ ఆలయ ప్రత్యేకతలను ప్రతిబింబించేలా టెర్మినల్ నిర్మిస్తున్నామని ఆయన వెల్లడించారు. ప్రతి ఒక్కరూ గర్వపడేలా విజయవాడ ఎయిర్‌పోర్ట్‌ తీర్చి దిద్దేలా ప్రణాళికలను అమలు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. దసరా నాటికి ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణం పూర్తి చేయాలని అధికారులకు లక్ష్యంగా నిర్ణయించారు. ఇదే సమయంలో గన్నవరం నుంచి పెరుగుతున్న ట్రాఫిక్ తో మరిన్ని సర్వీసులను అందుబాటులోకి తేవాలనే ప్రతిపాదనల పైనా కసరత్తు కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+