EPIC – First Semester First Review: 'ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్' మూవీ ఫస్ట్ రివ్యూ ఇదే..
టాలీవుడ్ లో లవ్ స్టోరీస్ కు ఎప్పుడూ సెపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. ఇటీవలికాలంలో ప్రేమ కథా చిత్రాల్ని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఫిబ్రవరిలో వచ్చిన కఫుల్ ఫ్రెండ్లీ మూవీ దగ్గర్నుంచి మొన్న వచ్చిన చెన్నై లవ్ స్టోరీ వరకూ లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు తాజాగా మరో లవ్ స్టోరీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అయింది. టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన 'ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్' మూవీ ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 11న విడుదల కానుంది. '90s' వెబ్ సిరీస్ తో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న యువ దర్శకుడు ఆదిత్య హాసన్.. ఈ చిత్రంతో చిత్ర సీమకు దర్శకుడిగా పరిచయం అవుతుండటం విశేషం. ఈ మూవీని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బృందం ఈ చిత్రానికి ఏ సర్టిఫికెట్ ను జారీ చేసింది. సాధారణంగా లవ్ స్టోరీస్ కు యూ/ఏ సర్టిఫికెట్ ను జారీ చేస్తుంది సెన్సార్. కానీ ఎపిక్ మూవీకి ఏ సర్టిఫికెట్ జారీ చేయడంతో 18 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వారికి థియేటర్లలోకి ప్రవేశం ఉండదు. ఇక సినిమాకు ఏ సర్టిఫికెట్ రావడంతో సామాజిక మాధ్యమాల్లో ఈ మూవీపై విపరీతమైన బజ్ ఏర్పడింది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కాంబోలో గతంలో బేబీ మూవీ వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇప్పుడు అదే కాంబో మరోసారి రిపీట్ కానున్న తరుణంలో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇటీవల రిలీజైన పాటలు, టీజర్, ట్రైలర్ సినిమాపై పాజిటివ్ బజ్ ను క్రియేట్ చేశాయి.

ఇక ఎపిక్ మూవీ స్టోరీ విషయానికి వస్తే చాలా లవ్ స్టోరీస్ మాదిరిగానే ఇది కూడా ఉంటుందని టాక్. కానీ ఈ మూవీలో ఓ ప్రత్యేకత ఉంటుందట. భిన్న దారులు, భిన్న మనస్తత్వాలు ఉన్న ఇద్దరు యువతీయువకులు లండన్ కు చదువుకోవడానికి వెళ్లి, అక్కడ కలుస్తారు. లివ్ ఇన్ లో ఉంటారు. ఆ ఇద్దరు ప్రైవేట్ గా మాట్లాడుకునే మాటలు ఏవైతే ఉంటాయో.. ఆ సంభాషణల మీద నడిచే సినిమానే ఎపిక్ మూవీ అని తెలుస్తోంది. అమ్మాయి జీవితాన్ని ఒకలా చూస్తుంది.. అబ్బాయి ఒకలా చూస్తాడు.. అసలు వీరిద్దరూ ఎలా కలిశారు..? వీరిద్దరి ఆలోచనలు ఏంటి..? అనేది కొత్తదనాన్ని తీసుకొస్తుంది. మూవీ మనసుకు హత్తుకునేలా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. మరి బేబీ మూవీలా వీరిద్దరి కాంబో బాక్సాఫీస్ వద్ద మరోసారి మ్యాజిక్ ను రిపీట్ చేస్తుందా..? లేదా..? చూడాలి.












Click it and Unblock the Notifications
