సినిమాలకు సుకుమార్ గుడ్ బై ..?
సుకుమార్ తెలుగు సినిమా రంగంలో తనదైన ముద్ర వేసిన దర్శకుడు. తన కథా కథనాలతో, కొత్త ప్రయోగాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ఇతను, తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంతో విలువైన ఆస్తిగా చెప్పవచ్చు. సుకుమార్ గారి చిత్రాలలో విజువల్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ప్రతి ఫ్రేమ్ కూడా కళాత్మకంగా ఉంటుంది. సుకుమార్‌ను తెలుగు ఇండస్ట్రీ ముద్దుగా లెక్కల మాష్టారు అని పిలుచుకుంటుంది. ఆర్య సినిమాతో అల్లు అర్జున్‌కు లైఫ్ ఇచ్చిన సుకుమార్, రంగస్థలం సినిమాతో రామ్ చరణ్‌లో నటుడును బయటకు తీసుకువచ్చారు.
పుష్ప సినిమాతో నేషనల్ లేవల్లో క్రేజ్ తెచ్చుకున్న సుకుమార్, పుష్ప-2 మరోసారి మ్యాజిక్ చేశారు. అయితే సుకుమార్ సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. 'పుష్ప-2' సినిమా ప్రీమియర్ షోస్ రోజున ఎటువంటి సమాచారం లేకుండా సంధ్య థియేటర్ దగ్గరకు వెళ్లడంతో అక్కడ భారీ తొక్కిసలాట ఏర్పడింది. ఈక్రమంలో రేవతి అనే ఓ మహిళ మరణించారు. రేవతి కుమారుడు శ్రీతేజ్‌కు తీవ్ర గాయాలై, ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

ఈ విషయంలో అల్లు అర్జున్‌తో పాటు, సంధ్య థియేటర్ యాజమాన్యంపై కూడా కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనలో అల్లు అర్జున్‌పై ఎఫైర్ నమోదు కావడంతో పోలీసులు ఆయన్ను అరెస్ట్ కూడా చేశారు. సంధ్య థియేటర్ దగ్గర మహిళ మరణించిన ఘటన సుకుమార్‌ను కలచి వేసింది. ఈ విషయాన్ని సుకుమార్ పుష్ప-2 సక్సెస్ మీట్‌లో చెప్పడం జరిగింది. సినిమా ఇంత పెద్ద హిట్ అయినా నాకు సంతోషంగా లేదని, సినిమాను రీక్రియేట్ చేయగలను కానీ, ఓ జీవితాన్ని తిరిగి ఇవ్వలేమని సుకుమార్ చెప్పుకొచ్చారు.
Papam ra SUKKU 😢
— Negan (@Negan_000) December 23, 2024
Waiting for your huge comeback with RC17 ♥️🔥#RamCharan𓃵 #Pushpa2TheRule#Sukumar #RC17pic.twitter.com/LyeJMBPCDK
తాజాగా సుమ సుకుమార్‌ను ప్రశ్నిస్తూ..ఒకటి వదిలేయా అంటే ఏది వదిలేస్తారని అడగ్గా.. సినిమాలు చేయడం మానేస్తానని సుకుమార్ చెప్పుకొచ్చాడు. దీంతో పక్కనే కూర్చున్న రామ్ చరణ్ షాక్ అయి అలా ఏం జరగదని సైగలు చేశాడు.అయితే తన సినిమా వల్ల ఓ మహిళ మరణించిందని మనోవేదనకు సుకుమార్ గురవుతున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతం సుకుమార్ సినిమాలు మానేస్తాను అని చెప్పిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications