ఓటీటీలోకి రాధిక బ్లాక్ బస్టర్ మూవీ.. ఇప్పుడే చూసేయండి..!
సీనియర్ నటి రాధిక లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ 'థాయ్ కిళవి' ఓటీటీలోకి రానుంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జియోహాట్ స్టార్ లో ఏప్రిల్ 10, 2026 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. ఒకప్పుడు తెలుగు, తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న నటి రాధిక.. మలి వయసులోనూ అదే రేంజ్ లో హిట్స్ అందుకోవడం విశేషం.
సీనియర్ నటి రాధిక ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'థాయ్ కిళవి'. ఈ మూవీని తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ నిర్మించడం విశేషం. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఈ మూవీలో రాధిక నటనకు ప్రశంసలు దక్కాయి. వృద్ధురాలిగా మంచంలో పడుకుని ఆమె చేసే హావాభావాలు సినిమాకు ప్రాణం పోశాయి. అందుకే ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయంలో కీలకమైన రాధికకు శివ కార్తికేయన్.. లాభాల్లో వాటా ఇచ్చి ఆశ్చర్యపరిచారు.
అయితే తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి రానుంది. ఏప్రిల్ 10 నుంచిజియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రానికి ఐఎండీబీ లో 8.1 రేటింగ్ ఉండటం ఆశ్చర్యం. ఇక 'థాయ్ కిళవి' స్టోరీ విషయానికి వస్తే.. రాధిక బామ్మ పాత్ర చేశారు. ఆ బామ్మకు కోపం ఎక్కువ. ఊరిలో వడ్డీల వ్యాపారం చేస్తూ ఉంటుంది. ఆమె ముక్కుసూటి మనిషి. అయితే తన ముగ్గురు కుమారులకు బాధ్యత లేకపోవడంతో ఇంటినుంచి గెంటేస్తుంది.

అదే సమయంలో బామ్మ దగ్గర బంగారు నిధి ఉంది అన్న ప్రచారం ప్రారంభమవుతుంది. మరోవైపు బామ్మకు హఠాత్తుగా పక్షవాతం వచ్చేసరికి మాట పడిపోతుంది. దీంతో కొడుకులు తిరిగి ఈమె దగ్గరకు వస్తారు. వాళ్లకు సైగ ద్వారా ఏదో చెప్పాలనే ప్రయత్నిస్తూ ఉంటుంది బామ్మ. ఇంతకీ అదేంటి? చివరకు ఏమైంది అనేదే స్టోరీ లైన్..












Click it and Unblock the Notifications