అరియానాతో రాజ్ తరుణ్‌కు ఎఫైర్..?
హీరో రాజ్ తరుణ్ వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. లావణ్య అనే యువతి హీరో రాజ్ తరుణ్ తనని మోసం పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. రాజ్ తరుణ్‌తో 11 ఏళ్ల నుంచి రిలేషన్ ఉన్నానని ..తామిద్దరం గుడిలో పెళ్లి కూడా చేసుకున్నామని చెప్పి పెద్ద షాకిచ్చింది. మధ్యలో ఓ హీరోయిన్ రావడంతో ఆమెతో ఎఫైర్ పెట్టుకుని వెళ్లిపోయాడని చెప్పుకొచ్చింది. రాజ్ తరుణ్ నాకు కావాలని తాను ఆయనతోనే ఉండాలని కోరుకుంటానని లావణ్య స్పష్టం చేసింది.
లావణ్య చేసిన ఆరోపణలపై తాజాగా రాజ్ తరుణ్ స్పందించారు. నేను ఒకప్పుడు లావణ్యతో రిలేషన్‌తో ఉన్న మాట వాస్తవమేనని రాజ్ తరుణ్ చెప్పుకొచ్చాడు. అయితే 2016-17 తర్వాత ఆమెతో తనకు ఎటువంటి శారీరక సంబంధం లేదని రాజ్ తరుణ్ క్లారిటీ ఇచ్చారు. ఆమె వ్యక్తిత్వం మంచిది కాదనే దూరంగా ఉన్నానని, ఇండస్ట్రీలో ఉన్న నాకున్న పరువు పోతుందనే ఇన్నాళ్లు తాను సైలెంట్‌గా ఉన్నానని రాజ్ తరుణ్ తెలిపారు.

ఇండస్ట్రీలో కష్టపడి ఈ స్థాయికి వచ్చానని.. ఆమె ప్రతి విషయానికి బెదిరించేదని.. అందుకే లావణ్య నుంచి దూరంగా ఉంటున్నానని రాజ్ తరుణ్ క్లారిటీ ఇచ్చారు. లావణ్య , మస్తాన్ అనే వ్యక్తితో రిలేషన్‌లో ఉందని, వారిద్దరూ రూంలో కలిసి ఉన్నప్పుడు తాను చూశానని రాజ్ తరుణ్ చెప్పుకొచ్చాడు. అయితే పోలీసులు ఈ కేసుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజ్ తరుణ్‌పై ఫిర్యాదు చేసిన లావణ్యకే రివర్స్‌లో నార్సింగ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలు వెంటనే సమర్పించాలని పోలీసులు ఆమెకు తెలిపారు.
91సీఆర్పీసీ కింద ఆమెకు నోటీసులు జారీ చేశారు. దీంతో మీడియా ముందుకొచ్చిన లావణ్య మరోసారి రాజ్ తరుణ్‌పై ఆరోపణలు చేసింది. నేను, మస్తాన్ సాయి ఎప్పుడు జంటగా కనిపించలేదు. ఒక పెళ్లికి గుంటూరు వెళ్లాం. అతడు కేవలం మ్యూచువల్ ఫ్రెండ్. నాతో ఎవరు మాట్లాడినా అతడితో రిలేషన్ లో ఉన్నట్లేనా.. ? అని లావణ్య ప్రశ్నించింది. లవర్ సినిమా నుంచి మాకు గొడవలు మొదలయ్యాయని.. డబ్బులు కోసం నేను బెదిరించాల్సిన అవసరం లేదని ఆమె తెలిపింది. రాజ్ తరుణ్‌కు చాలా మంది అమ్మాయిలతో రిలేషన్స్ ఉన్నాయని తెలిపింది. దీనిలో భాగంగానే బిగ్ బాస్ బ్యూటీ అరియానాతో రాజ్ తరుణ్ ఎఫైర్ నడిపాడాని ఆరోపణలు చేసింది. వీరిద్దరు కాల్ చేసుకుని మాట్లాడుకునేవారని , ఈ విషయం నటుడు రాజా రవీంద్రకు కూడా తెలుసునని ఆమె చెప్పుకొచ్చింది.












Click it and Unblock the Notifications