'వారణాసి'.. మరో ఊహించని ట్విస్ట్ ఇచ్చిన రాజమౌళి..!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'వారణాసి'. ఎస్ ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 7 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. హైదరాబాద్ శివారులో కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే అంటార్కిటికా ఖండంలో షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ మూవీకి సంబంధించి రోజుకో కొత్త న్యూస్ బయటకు వస్తోంది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ ఈ మూవీ విషయంలో మరో ట్విస్ట్ రివీల్ చేశారు. వారణాసి మూవీ మొత్తం ట్రూ ఐమాక్స్ ఫార్మాట్ లో ఉండదని స్పష్టం చేశారు. కేవలం కీలక సన్నివేశాల్లో మాత్రమే ప్రేక్షకులు ట్రూ ఐమాక్స్ అనుభూతిని ఆస్వాదిస్తారని తెలిపారు.
"భారత్ లో అత్యధిక శాతం స్క్రీన్స్ స్కోప్ ఫార్మట్ లోనే ఉంటాయి. మా ప్రేక్షకులు ఆ ఫార్మట్ థియేటర్స్ లోనే ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఇండియా లో ఐమాక్స్ స్క్రీన్స్ సంఖ్య చాలా తక్కువ. వారణాసి మూవీని ఐమాక్స్ ఫార్మట్ లో తీద్దాం అనుకున్నప్పుడు మాకొక పెద్ద ఛాలెంజ్ లా అనిపించింది. ఈ ఫార్మాట్ లో చిత్రాన్ని తెరకెక్కించి, స్కోప్ ఫార్మట్ ను తగ్గించాలా..? లేదా సినిమా స్కోప్ లో తెరకెక్కించి, ఐమాక్స్ వెర్షన్ ను ఫ్రేమ్ చేయాలా..? అని.. చాలా రోజుల పాటు చర్చించి.. చివరికి ఈ సినిమా కోసం మేము ఒక ఫార్ములా ను కనుకున్నాము.

వారణాసి మూవీ మొత్తం సినిమా స్కోప్ ఫార్మట్ లోనే ఉంటుంది. ఐమాక్స్ స్క్రీన్స్ లో మాత్రం సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలు నిజమైన ఐమాక్స్ ఫార్మట్ లో కనిపిస్తాయి.. అని రాజమౌళి పేర్కొన్నాడు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇక వారణాసి మూవీలో మహేశ్ రుద్ర అనే పాత్రలో నటిస్తున్నాడు. ప్రతినాయకుడు కుంభ గా పృథ్వీరాజ్ సుకుమారన్ అలాగే మందానికిగా ప్రియాంక చోప్రా కనిపించనున్నారు. ప్రకాశ్‌రాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు.












Click it and Unblock the Notifications