రాజేంద్రప్రసాద్‌తో విధి ఆడిన వింత నాటకం..అందుకే అలా జరిగిందా..!
తెలుగు ఇండస్ట్రీలో రాజేంద్రప్రసాద్‌కు మంచి గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టిన రాజేంద్రప్రసాద్ , ఆ తర్వాత కామెడీ హీరోగా మారారు. తెలుగు ఇండస్ట్రీలో మొదటి కామెడీ హీరోగా రాజేంద్రప్రసాద్ నిలిచారు. తెర మీద ఆయన్ను చూస్తేనే నవ్వు వచ్చేలా చేసేవారాయన. ఈ తరంలో కూడా నటిస్తున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారి హీరో, హీరోయిన్లకు తండ్రి పాత్రల్లో కనిపిస్తూ మెప్పిస్తున్నారు. తెర మీద అద్భుతంగా నవ్వించే రాజేంద్రప్రసాద్‌కు నిజ జీవితంలో మాత్రం విధి అతనితో వింత నాటకమే ఆడిందని చెప్పాలి. తాజాగా రాజేంద్రప్రసాద్ ఇంట్లో విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన కూతురు గాయత్రి శుక్రవారం రాత్రి గుండెపోటుతో మరణించారు.
కూతురు గాయత్రికి హఠాత్తుగా గుండెపోటు రావడంతో గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రికి వెంటనే తరలించారు.ఈ క్రమంలో వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తుండగానే తుది శ్వాస విడిచారు. చిన్న వయసులోనే తమ కళ్ల ముందే కూతురు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడాన్ని చూసిన రాజేంద్ర ప్రసాద్ దంపతులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. రాజేంద్రప్రసాద్ చిన్నప్పుడే తన తల్లిని కోల్పోయారు.అమ్మకోసం ఎదురు చూసి చూసి నా ప్రాణాల మీదకు తెచ్చుకున్నాను.. అమ్మకోసం ఏడ్చి ఏడ్చి తాను కూడా చనిపోయే స్టేజ్‌కి వచ్చానని.. అప్పుడు కుటుంబ సభ్యులు కనకదుర్గమ్మ గుడికి తీసుకువెళ్లారు.. ఇకపై నీకు కనకదుర్గమ్మే నీకు అన్నీ చెప్పడంతో అలా కనకదుర్గమ్మనే అమ్మ అని పిలుచుకుంటూ పెరిగానని రాజేంద్రప్రసాద్ ఓ సందర్భంలో చెప్పడం జరిగింది.

రాజేంద్రప్రసాద్ కూతురు గాయత్రి లవ్ మ్యారేజ్ చేసుకోవడంతో , ఆమెను దూరం పెట్టరాయన. కొంతకాలం ఇద్దరి మధ్య మాటలు లేవు.అయితే రాజేంద్రప్రసాద్ నటించిన బేవర్స్ సినిమాలో 'తల్లీ తల్లీ నా చిట్టి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మా.. నువ్వే లేని లోకాన నేను శవమల్లే మిగిలానమ్మా' అంటూ సుద్ధాల అశోక్ తేజ రాసిన పాట విన్నప్పుడు చిన్నప్పుడు చనిపోయిన తన అమ్మతో పాటు తనతో మాట్లాడటం మానేసిన కూతురు కూడా గుర్తుకు వచ్చి, కూతురు గాయత్రిని ఇంటికి పిలిచి బోరున విలిపించారట రాజేంద్రప్రసాద్.ఈ పాట విన్నాక నాకు తన కుమార్తెపై కోపం పోయిందని.. అమ్మ చనిపోయినప్పుడు ఎలా అయితే ఏడ్చానో.. అలా ఏడ్చేశా అని ఈ రెండు సంఘటనలు గుర్తు చేసుకుని బాధపడ్డానని రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఏ అమ్మవారిని అయితే అమ్మగా రాజేంద్రప్రసాద్ భావించారో.. ఆ అమ్మవారికి ఇష్టమైన దసరా రోజులలోనే తన కుమార్తెను కోల్పోయారు.అప్పుడు అమ్మ.. ఇప్పుడు కుమార్తె ఇద్దరూ మనోడిని వదిలి .. ఒంటరిని చేసి వెళ్లిపోయారు.












Click it and Unblock the Notifications