మళ్లీ నోరు జారిన రాజేంద్రప్రసాద్.. ఏకంగా మాజీ సీఎంపై.. (వీడియో)
నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు ఐదు దశాబ్దాల పాటు తెలుగు ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించిన హీరో ఆయనే.. అలా తన మార్క్ ఎంటర్ టైన్ మెంట్ సినిమాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ సెపరేట్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. ఓవైపు చిరంజీవి, బాలయ్య లాంటి బిగ్ స్టార్స్ మాస్ యాక్షన్ సినిమాలతో అలరిస్తుండగా.. వారికి పోటీగా కామెడీ ప్రధాన చిత్రాలు చేసి అదే స్థాయిలో మెప్పించారు. ఇటీవలి కాలంలో పలు చిత్రాల్లో ప్రధాన పాత్రలు చేస్తూ మెప్పిస్తున్నారు.
అయితే ఇటీవలి కాలంలో ఆయన పలు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. రాజేంద్రప్రసాద్ పలు ప్రెస్ మీట్లలో చేసిన కామెంట్లు వివాదాలుగా మారుతున్నాయి. స్టేజీపైన అసందర్భ మాటలు మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నారు. పుష్ప 2 సమయంలో ఓ మూవీ ఫంక్షన్ లో మాట్లాడుతూ.. ఇప్పుడు హీరోలు అంటే అర్థం మారిపోయిందని ఎర్ర చందనం దొంగ వాడు హీరో అంటూ వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలు దుమారం రేపాయి.
తమిళుల ఆరాధ్య దైవం స్వర్గీయ ఎంజీఆర్ గారిని దారుణంగా అవమానించిన టీడీపీ మద్దతుదారుడు నటుడు రాజేంద్ర ప్రసాద్
— UttarandhraNow (@UttarandhraNow) March 10, 2026
వీరికి పద్మశ్రీ ఇచ్చిన ప్రభుత్వానికి 🙏🏻#TDP supporter #RajendraPrasad insults Greatest of all times #MGR.
சின்னத்திரை எம்ஜிஆரை அவமதித்த தெலுங்கு தேசம் கட்சி… pic.twitter.com/Nr1s54pFlU
ఆ తర్వాత రాబిన్ హుడ్ మూవీ ప్రెస్ మీట్ లోనూ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ పై అసభ్యకర కామెంట్ చేశారు. దాంతో నెట్టింట ఆయనపై విమర్శలు వచ్చాయి. అంతటితో ఆగకుండా కమెడియన్ అలీపై దారుణమైన పదజాలం వాడారు. 'అరే అలీ ఇటు రారా..' అంటూ అసభ్య పదజాలంతో పిలిచారు. ఆ తర్వాత మరో ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందంపైనా పంచులు వేశారు రాజేంద్ర ప్రసాద్. బ్రహ్మీపై అసభ్య పదజాలం ప్రయోగించారు.

ఇప్పుడు తాజాగా మరోసారి నోరు జారారు రాజేంద్ర ప్రసాద్. అలనాటి తెలుగు హీరో కాంతారావు గొప్పతనాన్ని చెప్పే సమయంలో తమిళ సూపర్ స్టార్, మాజీ సీఎం ఎంజీఆర్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన్ను అవమానించేలా వ్యాఖ్యానించారు. కాంతారావును చూసి ఉ* పోసుకున్న నటుడు ఎంజీఆర్ అని.. జానపద చిత్రాల్లో కాంతారావు క్రేజ్ చూసి భయపడిన నటుడు అని చెప్పుకొచ్చారు. కళా ప్రపూర్ణ కాంతారావు జాతీయ పురస్కారం - 2025 అందుకున్న సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications