దర్శకులకు గిఫ్ట్స్ ఎవరైనా ఇస్తారు కానీ ఫ్యాన్‌కి ఇచ్చేవారే "తలైవా"..
సాధారణంగా సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయినప్పుడు నిర్మాతలు లేదా హీరోలు.. తమ దర్శకులకు, చిత్ర బృందానికి లగ్జరీ కార్లు, బంగారం గొలుసులు, వాచీలు గిఫ్ట్స్ గా ఇవ్వడం చూస్తూ ఉంటాం. కొన్నాళ్ళ క్రితం 'జైలర్' సినిమా సూపర్ హిట్ అయినప్పుడు నిర్మాత కళానిధి మారన్ గారు రజనీకాంత్‌కు, దర్శకుడికి ఖరీదైన కార్లను కానుకగా ఇచ్చారు. కమల్ హాసన్ సైతం విక్రమ్ సినిమాతో భారీ లాభాలు రావడంతో.. దర్శకుడు లోకేష్ కనగరాజ్‌కు లెక్సస్ (Lexus) కారును, సూర్యకు (రోలెక్స్ పాత్ర చేసినందుకు) ఖరీదైన రోలెక్స్ వాచ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. బాలయ్య కూడా రీసెంట్ గానే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కి ఒక కారు గిఫ్ట్ ఇచ్చారు.
కాగా పవన్ కళ్యాణ్ సైతం ఓజీ డైరెక్టర్ కి కారు ఇచ్చిన విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి కూడా గాడ్ ఫాదర్ సినిమా విజయం సాధించినందుకు దర్శకుడు మోహన్ రాజాకు సుమారు రూ. 1.5 కోట్ల విలువైన టయోటా వెల్‌ఫైర్ (Toyota Vellfire) కారును బహుమతిగా ఇచ్చారు. లేటెస్ట్ గా మన శంకర వరప్రసాద్ గారు మూవీ భారీ హిట్ కొట్టినందుకు రేంజ్ రోవర్ కారును అనిల్ రావిపూడికి కానుకగా ఇచ్చారు. అయితే దర్శకులకు, సంగీత దర్శకులకు, చిత్ర యూనిట్ కి, నటీనటులకు గిఫ్ట్ లు ఎవరైనా ఇస్తారు కానీ అభిమానికి మర్చిపోలేని సర్ ప్రైజ్ తో పాటు బెస్ట్ గిఫ్ట్ ఇచ్చారు సూపర్ స్టార్. దీంతో ఈ వ్యవహారం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

ఏం జరిగిందంటే..
రజనీకాంత్ సమాజానికి సేవ చేస్తున్న తన వీరాభిమానిని ప్రత్యేకంగా అభినందించారు. మధురైకి చెందిన రజనీ శేఖర్ అనే వ్యక్తి సూపర్‌స్టార్‌కు పెద్ద ఫ్యాన్. తన హోటల్‌లో పేదల కోసం కేవలం 5 రూపాయలకే పరోటాను విక్రయిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న రజనీకాంత్, శేఖర్‌ను, అతని కుటుంబాన్ని చెన్నైలోని తన నివాసానికి ఆహ్వానించారు. ఆయన చేస్తున్న మంచి పనిని ప్రశంసించి, ప్రోత్సాహకంగా ఒక బంగారు గొలుసును బహుమతిగా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను రజనీకాంత్ సన్నిహితులు సోషల్ మీడియాలో పంచుకోగా.. ఈ విషయం ఇంటర్నెట్‌లో వైరల్ గా మారింది.
ఇక రజినీకాంత్.. కేవలం ఇండియా లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఫ్యాన్స్ ని సంపాదించుకున్నారు. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ ఇలా భాషతో సంబంధం లేకుండా ఆయనకు అభిమానులు ఉన్నారు. గత ఏడాది లోకేష్ దర్శకత్వంలో కూలీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాగా.. ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది. ప్రస్తుతం నెల్సన్ దర్శకత్వంలో "జైలర్ 2 " చిత్రంలో నటిస్తున్నారు. జైలర్ కి ఇది సీక్వెల్ గా రాబోతుంది. ఈ సీక్వెల్ లో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ తో పాటు విజయ్ సేతుపతి, ఎస్.జె. సూర్య వంటి నటులు కూడా నటిస్తున్నారని సమాచారం.
మరోవైపు పొంగల్ పండుగ సందర్భంగా.. సిబి చక్రవర్తి దర్శకత్వంలో తన కొత్త సినిమా షూటింగ్ ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభమవుతుందని వెల్లడించారు. #తలైవర్173 అనే వర్కింగ్ టైటిల్‌తో రానున్న ఈ చిత్రాన్ని కమల్ హాసన్ నిర్మిస్తుండటం గమనార్హం. ఈ ప్రాజెక్టుకు మొదట లోకేష్, సుందర్ సి దర్శకత్వం వహిస్తారని టాక్ నడవగా.. వారు తప్పుకోవడంతో సిబి చక్రవర్తి చేతికి వచ్చింది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications