75 ఏళ్ల వయసులో జెన్ జీ కిడ్స్ ను థియేటర్లకు పరుగులు పెట్టిస్తున్న తలైవా.. ఆయన ఫిట్‌ నెస్ సీక్రెట్ ఇదే..!.

సూపర్ స్టార్ రజనీకాంత్ వయసు అక్షరాలా 75 సంవత్సరాలు.. బెంగళూరులో బస్ కండక్టర్ గా జీవితాన్ని ప్రారంభించిన శివాజీరావు గైక్వాడ్.. ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీలో తనదైన స్టైల్, స్వాగ్, నటనతో సూపర్ స్టార్ గా తిరుగులేని శక్తిగా ఎదిగారు. కోట్లాదిమంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. ఐదు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తూ కోట్ల మందికి ఆరాధ్యదైవంగా మారారు రజనీకాంత్. 75 ఏళ్ల వయసులోనూ బాక్సాఫీస్ ను గింగిరాలు తిప్పుతున్నారు. ఇటీవల జైలర్ 2 చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు రజనీకాంత్. దసరా కానుకగా అక్టోబర్ 15 న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది.

విడుదలైన కేవలం నాలుగు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 425 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి కోలీవుడ్ తో పాటు తెలుగు, మలయాళం, హిందీ అని తేడా లేకుండా సత్తా చాటుతోంది. అటు ఓవర్సీస్ లోనూ నాలుగు రోజుల్లోనే రూ. 190 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సూపర్ స్టార్ స్టామినా ఏంటో మరోసారి నిరూపించింది. దసరా పండగ సీజన్ ఇంకా ఉన్న తరుణంలో జైలర్ 2 తో కోలీవుడ్ చిత్ర పరిశ్రమ తొలి రూ. 1000 కోట్ల సినిమాను చూసే అవకాశం కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే 75 ఏళ్ల వయసులోనూ రజనీకాంత్ ఇంత ఫిట్ గా ఉండటానికి కారణం ఏంటి..? ఇప్పుడు జెన్ జీ ముందు ఉన్న ప్రశ్న ఇదే..

Rajinikanth super star remains fully active even at the age of 75 Do you know his fitness secret

అయితే రజనీకాంత్ ఫిట్ నెస్ పై జైలర్ 2 కో స్టార్ మిర్నా మీనన్ కీలక విషయాలను వెల్లడించారు. రజనీకాంత్ క్రమం తప్పకుండా రోజూ వ్యాయామం చేస్తారని పేర్కొన్నారు. జిమ్ లేని ప్రదేశాల్లో షూటింగ్ ఉన్నా సరే ఆయన మాత్రం వ్యాయామం మానేయరని స్పష్టం చేశారు. అంతేకాక రజనీకాంత్ డైలీ రొటీన్‌ లో స్విమ్మింగ్ కచ్చితంగా ఉంటుందని పేర్కొన్నారు. స్విమ్మింగ్ చేయడం కారణంగా హార్ట్ హెల్త్ పదిలంగా ఉంటుందని మిర్నా మీనన్ తెలిపారు. ఇక డైట్ విషయానికి వస్తే మసాలాలు, ఫ్రైల జోలికి పోకుండా ఆయన చాలా సింపుల్ గా ఉండే డైట్ నే ఫాలో అవుతారని స్పష్టం చేశారు. ఎంత పని ఒత్తిడి ఉన్నా ఆయన డైలీ రొటీన్ ను మాత్రం బ్రేక్ చేయరని ఈ మేరకు క్రమం తప్పకుండా ఈ నియమాలను పాటిస్తారని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+