వైసీపీకి హైకోర్టులో మరో షాక్..! కేంద్ర బలగాల భద్రత పిటిషన్ పై తీర్పు..!

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో విపక్ష వైఎస్సార్సీపీకి (YSRCP) ఏదీ కలిసి రావడం లేదు. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పార్టీ అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు చేయకుండా అధికార కూటమి పోలీసుల సాయంతో అడ్డుకుంది. వీటిపై ఎస్ఈసీకి నేరుగా జగనే వచ్చి ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ సందర్భంగా కూడా భారీ హింస చోటు చేసుకునే అవకాశం ఉన్నందున కేంద్ర బలగాలను మోహరించేలా ఆదేశాలు కోరుతూ వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది.

మారిపోతున్న లెక్కలు- ఆత్మరక్షణలో కేంద్రం..! ఫలించని మైండ్ గేమ్ ?
మారిపోతున్న లెక్కలు- ఆత్మరక్షణలో కేంద్రం..! ఫలించని మైండ్ గేమ్ ?

ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ గతంలోనే తోసిపుచ్చారు. అయితే సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ వైసీపీ హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది. ఈ మేరకు వైసీపీ దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ హైకోర్టు విచారణ జరిపింది. అయితే హింసాయుత పరిస్ధితులను కారణంగా చూపి పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలతో భద్రత ఏర్పాటు చేయాలన్న వైసీపీ విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చింది. ఈ మేరకు వైసీపీ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టేసింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పునే సమర్థించింది. దీంతో వైసీపీ కేంద్ర బలగాల భద్రత లేకుండానే మున్సిపల్ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ ఎదుర్కోవాల్సి వస్తోంది.

Setback to YSRCP as AP High Court Upholds Order against Central Forces Deployment for Local Polls
ఈసీల చట్టంపై జగన్ ఒత్తిడి వెనుక? 2018 సీన్ రిపీట్ కాబోతోందా ? కానీ ఈసారి..!
ఈసీల చట్టంపై జగన్ ఒత్తిడి వెనుక? 2018 సీన్ రిపీట్ కాబోతోందా ? కానీ ఈసారి..!

ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్ధులు నామినేషన్లు వేయకుండా కూటమి శ్రేణులు, పోలీసులు పలు చోట్ల అడ్డంకులు సృష్టించారు. వీటిని ఎంత ప్రతిఘటించేందుకు ప్రయత్నించినా పలు చోట్ల వైసీపీ వల్ల కాలేదు. దీంతో పుంగనూరు, కడప వంటి కీలకమైన ప్రాంతాల్లో సైతం వైసీపీ అభ్యర్ధులు నామినేషన్లు వేయకుండా ఎన్నికలకు దూరంగా ఉండిపోవాల్సిన పరిస్ధితి ఎదురైంది. వైసీపీ ఎంపీలు మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి వంటి వారు నేరుగా రంగంలోకి దిగినా ఫలితం లేకుండా పోయింది. ఇదే పరిస్ధితి మున్సిపల్ ఎన్నికలతో పాటు తర్వాత జరిగే పరిషత్, పంచాయతీ ఎన్నికల్లో సైతం తప్పదనే భయంతో వైసీపీ ఈ పిటిషన్ దాఖలు చేసింది. ఇందులోనూ ఆ పార్టీకి ఊరట దక్కలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+