సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు సీబీఐకి బదిలీ, పరిహారం- హైకోర్టు సంచలన ఉత్తర్వులు..!!
గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు లో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసును సీబీఐ కి అప్పగించాలని హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. అదే విధంగా సాయికృష్ణ తల్లికి పరిహారం చెల్లించాలని కోర్టు తీర్పులో స్పష్టం చేసింది. విజయవాడలో జరిగిన ఈ కస్టోడియల్ డెత్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు విచారణ కోసం సిట్ నియమించింది. సీఐ నాగరాజును అరెస్ట్ చేసారు. ఇప్పుడు హైకోర్టు తీర్పుతో ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది.
విజయవాడలో జరిగిన గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ ఏపీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సాయికృష్ణ కేసును సీబీఐకు ఇవ్వాలని తల్లి విజయ లక్ష్మి పిటిషన్ను విచారించిన హైకోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది. పిటిషన్ను ఉపసంహరించు కోవడానికి అనుమతి ఇవ్వాలని విజయలక్ష్మీ మరో పిటిషన్ దాఖలు చేసారు. ప్రభుత్వం సిట్ను నియమించిందని అందువల్ల తాను వేసిన పిటిషన్ ఉపసంహరించుకుంటున్నానని విజయలక్ష్మి తన పిటీషన్ లో పేర్కొన్నారు. అయితే, హైకోర్టు పిటీషన్ ను ఉప సంహరించుకోలేదు. కాగా.. ఇప్పుడు విచారణ తరువాత హైకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించింది. అదే విధంగా సాయికృష్ణ తల్లికి రూ 25 లక్షల పరిహారం ఇవ్వాలని హైకోర్టు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి సీబీఐ
సాయికృష్ణ లాకప్ డెత్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. మే 6న మార్కాపురంలో పోలీసులు అదుపులోకి తీసుకున్న సాయికృష్ణ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో హింసకు గురై మరణించినట్లు, అనంతరం మృతదేహాన్ని దహనం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో, ఈ వ్యవహారం పైన ప్రభుత్వం సిట్ తో విచారణకు ఆదేశించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఊ నాగరాజుతో పాటుగా సహకరించిన సిబ్బందిని అరెస్ట్ చేసారు. పలు ఆధారాలు సేకరించారు. ఈ కేసు విచారణకు సంబంధించి ఇంతకుముందు సుప్రీంకోర్టు సీరియస్ అయ్యి, రికార్డులను సీల్డ్ కవర్లో కోరడం మరియు హైకోర్టు తదుపరి చర్యలపై స్పష్టమైన పరిశీలనలు జరిగాయి. ఈ కేసులో సిట్ అధికారులు సీసీ ఫుటేజ్ మిస్ చేయటం పైనా ఆరా తీసింది. కాగా.. ఇప్పుడు హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించటంతో ఇప్పుడు ఆసక్తిని పెంచుతోంది.












Click it and Unblock the Notifications
