ఒక్కసారి ఫుల్ ట్యాంక్ కొట్టిస్తే 1400 కిమీ మైలేజ్!

ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ అంతర్జాతీయ ఆటోమొబైల్ తయారీ సంస్థ 'రెనాల్ట్' భారత ఆటోమొబైల్ రంగంలో సరికొత్త సంచలనానికి శ్రీకారం చుట్టింది. దేశంలో అత్యధిక మైలేజ్ ఇచ్చే బెస్ట్ హైబ్రిడ్ ఎస్‌యూవీగా 'రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్' మోడల్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. ఎవల్యూషన్, టెక్నో, ఎమోషన్ అనే మూడు ప్రధాన వేరియంట్లలో లభించే ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.16.99 లక్షల నుంచి రూ.19.49 లక్షల వరకు ఉంది. రూ.21,000 టోకెన్ అమౌంట్‌తో ఈ కార్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమవ్వగా.. నవంబర్ 2026 నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి. మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న మారుతి గ్రాండ్ విటారా, విక్టోరిస్, టొయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్ వంటి హైబ్రిడ్ ఎస్‌యూవీలకు ఇది గట్టి పోటీనివ్వనుంది.

గాల్లో ఎగిరే కారు.. రూ. 2.37 కోట్లు కేవలం బుకింగ్ కోసమే!
గాల్లో ఎగిరే కారు.. రూ. 2.37 కోట్లు కేవలం బుకింగ్ కోసమే!

సెగ్మెంట్లోనే అత్యంత పవర్‌ఫుల్ ఇంజిన్
రెనాల్ట్ కు చెందిన పాపులర్ 'RGMP' ఆర్కిటెక్చర్‌పై రూపుదిద్దుకున్న ఈ డస్టర్ హైబ్రిడ్‌లో బ్రాండ్ అడ్వాన్స్‌డ్ 'E-Tech 160' సిస్టమ్‌ను అమర్చారు. ఇందులో 1.8 లీటర్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు రెండు ఎలక్ట్రిక్ మోటార్లు, 1.4kwh ఎన్ఎంసీ బ్యాటరీ ప్యాక్, మల్టీ-మోడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌ మిషన్ సెటప్ ఉన్నాయి. ఇది మొత్తం మీద 160 bhp పవర్, 208nm టాప్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ సెగ్మెంట్లోనే అత్యంత పవర్ ఫుల్ హైబ్రిడ్ పవర్ ట్రెయిన్‌గా నిలిచిన ఈ కారు.. కేవలం 9.61 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

Renault Duster Hybrid Launched in India Offers 29 kmpl Mileage and 1400 km Range Full Details Here

29 కేఎంపీఎల్ మైలేజ్.. 1400 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్
ఈ ఎస్‌యూవీకి ఉన్న అతిపెద్ద ప్రత్యేకత దీని అద్భుతమైన ఫ్యూయల్ ఎఫిషియెన్సీ. రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన ప్రకారం లీటరుకు ఏకంగా 29 కిలోమీటర్ల మైలేజ్‌ను అందిస్తుంది. ఈ కారులో 50-లీటర్ల కెపాసిటీ ఉన్న ఫ్యూయల్ ట్యాంక్‌ను అందించారు. దీనివల్ల ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేస్తే 1400 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించవచ్చని కంపెనీ వెల్లడించింది. ఎక్కువగా ప్రయాణాలు చేసే వారికి ఈ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడనుంది.

Video: గాల్లో ఎగిరే టెస్లా సూపర్ కారు.. ప్రపంచాన్ని షేక్ చేసిన ఎలాన్ మస్క్!
Video: గాల్లో ఎగిరే టెస్లా సూపర్ కారు.. ప్రపంచాన్ని షేక్ చేసిన ఎలాన్ మస్క్!

అద్భుతమైన డిజైన్, హై గ్రౌండ్ క్లియరెన్స్
డిజైన్ విషయానికి వస్తే.. డస్టర్ హైబ్రిడ్ తన టర్బో-పెట్రోల్ వేరియంట్లను పోలి ఉంటుంది. అయితే హైబ్రిడ్ మోడల్‌ను ప్రత్యేకంగా గుర్తించడానికి ఫ్రంట్ డోర్లు, టెయిల్ గేట్‌పై 'E-Tech Hybrid' బ్యాడ్జింగ్‌ను అందించారు. గుంతలు, తీవ్రమైన ఒడుదొడుకులు ఉన్న భారతీయ రోడ్లపై సునాయాసంగా ప్రయాణించడానికి వీలుగా ఈ ఎస్‌యూవీలో 212 మిల్లీమీటర్ల పెద్ద గ్రౌండ్ క్లియరెన్స్‌ను అందించడం విశేషం.

లగ్జరీ ఇంటీరియర్, సెక్యూరిటీ ఫీచర్లు
కారు ఇంటీరియర్ క్యాబిన్‌ను చాలా ప్రీమియం, కంఫర్టబుల్‌గా తీర్చిదిద్దారు. మిడ్-స్పెక్ వేరియంట్‌లో డెసర్ట్ బేజ్ సెమీ-లెదరెట్, టాప్ ట్రిమ్‌లో డ్యూన్ బ్రౌన్ లెదరెట్ అపోల్స్టరీ ఇచ్చారు. వీటితో పాటు 10.1-ఇంచుల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-ఇంచుల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, డ్యుయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 6-వేస్ ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, క్రూజ్ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి ఆధునిక రక్షణ సదుపాయాలు ఇందులో ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+