అదే నేను చేసిన పెద్ద తప్పు - రకుల్
ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్‌గా రకుల్ ఓ వెలుగు వెలిగిన సంగతి అందరికి తెలిసిందే. మహేష్ బాబు, ఎన్టీఆర్ , అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. తెలుగులో నెంబర్ వన్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన రకుల్.. వరుస ఫ్లాపులతో డీలా పడిపోయింది. కోలీవుడ్, బాలీవుడ్‌లో కొన్నిసినిమాల్లో నటించినప్పటికీ అక్కడ ఆమెకు సరైన హిట్ మాత్రం దక్కలేదు.
దీంతో రకుల్‌కు అవకాశాలు తగ్గిపోయాయి. ఇదే సమయంలో రష్మిక, పూజా హెగ్డె, శ్రీలీల వంటి స్టార్స్ ఇండస్ట్రీలోకి దూసుకురావడంతో రకుల్ రేసులో వెనుకపడిపోయింది. ఫొటో షూట్లు, జిమ్ వీడియోలతో గ్లామర్‌గా కనిపించినా కూడా ఫలితం లేకుండా పోయింది. రకుల్ ప్రీత్ సింగ్ ఈ మధ్య తరుచు వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా పెళ్లి తరువాత ఆమె సోషల్ మీడియాలో ఎక్కువ కనిపిస్తున్నారు.

ఇదిలా ఉంటే రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా వర్కౌట్‌పై కొన్ని కామెంట్స్ చేశారు. రకుల్ ఇటీవల వర్కౌట్ చేస్తూ గాయపడింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ ఓ పోస్ట్ పెట్టారు. ఆమె వెన్నెముకకు గాయమైందని చికిత్స తీసుకుంటున్నట్లు వెల్లడించారు. దీనిపై ఆమె స్పందిస్తూ..అక్టోబర్ 5న 80 కిలోల బరువు ఎత్తాను. అప్పుడే నా వెన్నెముకలో నొప్పి వచ్చింది. కానీ ఆ నొప్పిని నేను పట్టించుకోకుండా వర్కౌట్ చేశాను. అదే నా పాలిట శాపం అయింది.
వర్కవుట్ అవ్వగానే సినిమా షూటింగ్‌కు వెళ్లాను. సాయంత్రం అయ్యేసరికి విపరీతమైన వెన్నునొప్పి వచ్చింది. కొంచెం కూడా బెండ్ అవలేకపోయాను. అయినప్పటికీ అదే తగ్గుతుందని ఆ నొప్పి భరిస్తూనే ఐదు రోజులు గడిపా. నొప్పిని తట్టుకోలేకపోయాను. బీపీ పడిపోయింది. పదిరోజులు ఆస్పత్రి బెడ్‌పై గడిపానని రకుల్ చెప్పుకొచ్చింది. నేను ఇప్పుడు బాగానే ఉన్నాను. కానీ పూర్తిగా కోలుకోలేదని తెలిపింది. రకుల్‌కు ఏమైందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.












Click it and Unblock the Notifications