మాట తప్పితే నేను రామ్‌చరణ్ కాను: దిల్ రాజుకు హామీ
భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా రూపొందిన సినిమా గేమ్ ఛేంజర్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు దీన్ని రూ.450 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. తన కెరీర్ లో 50వ చిత్రం కావడంతో మైలురాయిగా ఉండాలనే ఉద్దేశంతో దిల్ రాజు ఈ సాహసం చేశారు. ఈనెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ అయింది. శంకర్ నిర్మాత దిల్ రాజును, హీరోగా మూడు సంవత్సరాలు కష్టపడ్డ రామ్‌చరణ్ ను నిండా ముంచేశాడు. కాలం చెల్లిన కథ, కథనాలతో ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు.
పవన్ కల్యాణ్ వారసుడిని అనిపించుకున్నాడు
ఈ సినిమా ఇప్పటివరకు కేవలం రూ.200 కోట్ల లోపు గ్రాస్ కలెక్షన్లు సాధించింది. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే పెద్ద లక్ష్యమే ఉంది. అది అందుకోవడం అసాధ్యం. 14వ తేదీనే దిల్ రాజు నిర్మించిన మరో సినిమా సంక్రాంతికి వస్తున్నాం విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాద్వారా దిల్ రాజుకు రూ.100 కోట్లు మాత్రమే వస్తాయి. అయినా గేమ్ ఛేంజర్ నష్టాలను పూడ్చడం కష్టమే. పెట్టిన పెట్టుబడితోపాటు వాటికి అయిన వడ్డీలు కూడా చాలా దారుణంగా ఉన్నాయి. ఇటువంటి తరుణంలో రామ్ చరణ్ ఒక మంచి నిర్ణయం తీసుకొని పవన్ కల్యాణ్ కు వారసుడిని అనిపించుకున్నాడు.

నాకు ఒక్క రూపాయి కూడా వద్దు
ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నానని, తర్వాత సుకుమార్ తో మరో సినిమా చేయబోతున్నానని, ఈ రెండు సినిమాలు అయిపోయిన తర్వాత మీకు సినిమా చేస్తానని రామ్ చరణ్ దిల్ రాజుకు హామీ ఇచ్చారు. పారితోషికం ఒక్క రూపాయి కూడా తీసుకోనని, సినిమా విడుదలై వాణిజ్యపరంగా విజయవంతమై లాభాలు వస్తే, ఆ లాభాల్లో వాటా ఇవ్వండి.. లేదంటే అవి కూడా అవసరం లేదు అని స్పష్టంగా చెప్పాడు.
రామ్ చరణ్ ఇటువంటి నిర్ణయం తీసుకోవడంపై తెలుగు సినీ పరిశ్రమలో హర్షం వ్యక్తమవుతోంది. ఏళ్ల తరబడి ఒకే సినిమా చేస్తూ రూ.300 కోట్ల పారితోషికం తీసుకునే హీరోలకన్నా రామ్ చరణ్ లాంటి హీరోలు పరిశ్రమకు అవసరం అంటూ వ్యాఖ్యలు వస్తున్నాయి. మాట తప్పనని రామ్ చరణ్ దిల్ రాజుకు గట్టిగా చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు వెళ్లి ఆ సినిమా కలెక్షన్లు పెంచి దిల్ రాజుకు కష్టాలు రాకుండా చూస్తామంటున్నారు.












Click it and Unblock the Notifications