మెగా ఫ్యాన్స్‌కు మరో బ్యాడ్ న్యూస్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగాస్టార్ చిరంజీవి వారసుడుగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ , అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 'చిరుత' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్, తన రెండో సినిమా 'మగధీర'తో ఇండస్ట్రీ కొట్టి తన స్టామినా నిరూపించుకున్నాడు. ఇక రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'ఆర్ఆర్ఆర్' సినిమాలో తన నటనతో విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకున్నారాయన. ఈ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగాడు.
రామ్ చరణ్ ప్రస్తుతం 'గేమ్ ఛేంజర్' అనే సినిమాలో నటిస్తున్నాడు. స్టార్ దర్శకుడు శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ ఈ సినిమాలో రామ్ చరణ్‌కు జంటగా నటిస్తోంది. 'గేమ్ ఛేంజర్' సినిమాను డిసెంబర్‌లో విడుదల చేస్తామని నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదల వాయిదా పడినట్టు తెలుస్తోంది. ఇటీవల వినాయక చవితి సందర్భంగా ఈ సినిమాలోని సెకండ్ సాంగ్ రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించారు.

ఏం జరిగిందో తెలియదు కానీ, ఆ పాటను ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు. శంకర్ నుంచి ఇంకా పాటకు సంబంధించిన ఫైనల్ అప్రూవల్ రాలేదని తెలుస్తోంది. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం డిసెంబరులో గేమ్ చేంజర్‌ను విడుదల చేసే అవకాశం లేదని, మార్చిలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నారని తెలిసింది.గత రెండేళ్లుగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రం విడుదల ఎప్పుడూ అనేది ఇప్పటి వరకు క్లారిటి రాలేదు. దీంతో రామ్ చరణ్ అభిమానుల్లో అసహనం పెరిగిపోతుంది.అయితే కమల్ హాసన్ నటించిన భారతీయుడు -2 ఫ్లాప్ కావడంతో దర్శకుడు శంకర్ ఈ సినిమాపై ఫోకస్‌గా పని చేస్తున్నారని, అందుకే సినిమా ఆలస్యం అవుతుందని తెలుస్తోంది. మరి సినిమా రిలీజ్‌పై దిల్ రాజు ఎలాంటి క్లారిటీ ఇస్తారో చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications