రామ్ చరణ్ 'పెద్ది'లో క్రేజీ ఐటమ్ సాంగ్.. ముగ్గురు స్టార్ హీరోయిన్లతో మాస్ స్టెప్పులు
రామ్ చరణ్, బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో వస్తున్న 'పెద్ది' సినిమా ఇప్పుడు టాలీవుడ్‌లోనే కాదు, ఇండియన్ సినిమా సర్కిల్స్‌లో హాట్ టాపిక్. 'ఉప్పెన' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా ఈ మూవీకి సంబంధించిన ఒక్కో అప్‌డేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సాధారణంగా ఒక పెద్ద హీరో సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉంటేనే ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతారు. కానీ, 'పెద్ది' విషయంలో వస్తున్న తాజా వార్త వింటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఈ సినిమాలో రాబోయే ప్రత్యేక గీతం కోసం ఏకంగా ముగ్గురు స్టార్ హీరోయిన్లను రంగంలోకి దించుతున్నట్లు సమాచారం. పూజా హెగ్డే,మృనాల్ ఠాకూర్, అయేషా ఖాన్ ముగ్గురు హీరోయిన్లతో స్పెషల్ సాంగ్ ప్లాన్ చేశారట మూవీ మేకర్స్.
తన గ్లామర్ ,డ్యాన్స్‌తో ఇప్పటికే టాలీవుడ్‌ను ఏలేసింది బుట్టబొమ్మ. మృనాల్ ఠాకూర్ క్లాసిక్ లుక్స్‌తో మెప్పించే ఈ భామ, ఇలాంటి మాస్ నెంబర్‌లో కనిపిస్తే ఆ క్రేజే వేరు.సోషల్ మీడియా సెన్సేషన్ ,బిగ్ బాస్ ఫేమ్ అయేషా ఖాన్ గురించి కొత్తగా చెప్పాల్సిన లేదు. మొదట ఈ పాటలో మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తుందని ప్రచారం జరిగినప్పటికీ, ఇప్పుడు ఈ ముగ్గురు భామల పేర్లు వైరల్ అవుతున్నాయి. ఒకే ఫ్రేమ్‌లో రామ్ చరణ్‌తో కలిసి ఈ ముగ్గురు స్టెప్పులేస్తే.. అది ఖచ్చితంగా ఇండియాలోనే బిగ్గెస్ట్ ఐటెం సాంగ్ అవుతుందనడంలో సందేహం లేదు.

ఏ.ఆర్. రెహమాన్ మ్యూజిక్ మ్యాజిక్
ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తుండటం మరో విశేషం. సాధారణంగా రెహమాన్ పాటలు క్లాస్ మెలోడీలుగా ఉంటాయి. కానీ, బుచ్చిబాబు తన సినిమాల్లో సంగీతానికి ఇచ్చే ప్రాధాన్యత మనకు తెలిసిందే. ఇప్పటికే ఈ స్పెషల్ సాంగ్ కోసం రెహమాన్ ఒక అదిరిపోయే ట్యూన్‌ను సిద్ధం చేశారట. మాస్ బీట్‌కు రెహమాన్ మార్క్ టెక్నికల్ వాల్యూస్ తోడైతే, థియేటర్లు దద్దరిల్లడం ఖాయం.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన షూటింగ్ షెడ్యూల్స్‌ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. మొదట మార్చి 27న విడుదల చేయాలని భావించినప్పటికీ, అవుట్‌పుట్ విషయంలో రాజీ పడకూడదనే ఉద్దేశంతో మేకర్స్ ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30 కి వాయిదా వేశారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు వంటి హేమాహేమీలు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.వృద్ధి సినిమాస్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్‌తో, ఎక్కడా తగ్గకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రామ్ చరణ్ క్రేజ్, బుచ్చిబాబు మేకింగ్, రెహమాన్ మ్యూజిక్.. ఇవన్నీ ఒకెత్తయితే, ఈ ముగ్గురు భామల స్పెషల్ సాంగ్ మరో ఎత్తు. ఏప్రిల్ 30న 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సునామీ సృష్టిస్తుందో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications