అల్లు అర్జున్‌పై ఆ ముగ్గురు హీరోల తీవ్ర ఆగ్రహం
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై కేసు నమోదవడం.. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం చకాచకా జరిగిపోయాయి. ఆ కాపీలు ఆలస్యంగా అర్థరాత్రి ఆన్ లైన్ లో అప్ లోడ్ కావడంతో రాత్రంతా చంచల్ గూడ జైలులో ఉండి తర్వాత రోజు ఉదయం జైలు నుంచి బన్నీ బయటకు వచ్చారు. సినీ ప్రముఖులు కొందరు ఆయన్ను పరామర్శించారు. తర్వాత అల్లు అర్జున్ స్వయంగా బండి నడుపుకుంటూ ముందుగా పెద మామయ్య చిరంజీవి ఇంటికి వెళ్లి గంట సమయం గడిపారు. ఆ తర్వాత నాగబాబు ఇంటికి వెళ్లి పలు విషయాలపై చర్చించారు. దీంతో తాత్కాలికంగా మెగా, అల్లు కుటుంబాల మధ్య విభేదాలు సమసిపోయాయని అందరూ భావించారు.
ఇప్పటివరకు కనీసం పలకరించలేదు
ఇన్ని పరిణామాలు జరుగుతున్నప్పటికీ అల్లు అర్జున్ ను రామ్ చరణ్ కనీసం కలవలేదు.. ఫోన్ లో ఏమిటి విషయం అని అడగలేదు.. ఏమీ పట్టనట్లుగానే వ్యవహరించారు. వరుణ్ తేజ్ కూడా అంతే. మట్కా సినిమా వేడుకలో పరోక్షంగా బన్నీపై వ్యాఖ్యలు చేశారు. తర్వాత సాయిధరమ్ తేజ్ కూడా ఈ సంఘటనపై ఏమీ మాట్లాడలేదు. ఏం జరిగింది? అనే విషయం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. పుష్ప2 సినిమా విడుదలైనప్పుడు మాత్రం బన్నీతోపాటు సుకుమార్ కు, నిర్మాతలకు విషెస్ చెప్పగా, అందుకు అల్లు అర్జున్ బదులిచ్చి కృతజ్ఞతలు తెలిపాడు. అంతకుమించి ఈ ముగ్గురు హీరోల మధ్య ఇప్పటికీ మాటల్లేవు.

ఏం జరిగిందనేది వారికే తెలియాలి
ఏం జరిగిందో వారికే తెలియాలి. అసలు చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబు ఈ విషయంపై మాట్లాడుకున్నప్పటికీ రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ ఎందుకు స్పందించలేదు అనేది వారికే తెలియాలి. రానా పుట్టినరోజు ఉంటే అతనికి రామ్ చరణ్ శుభకాంక్షలు తెలియజేశాడు. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ పై దృష్టిపెట్టారు. ఏదీ జరగందే బన్నీ తన జీవితంలో మరపురాని అనుభవాన్ని ఎదుర్కొన్నప్పటికీ పలకరించలేదు అంటే మెగా కుటుంబంతో అల్లు కుటుంబానికి ఉన్న విభేదాలు చల్లారలేదని తెలుస్తోంది. బన్నీ వ్యక్తిగతంగా తనకు తానుగా ఎదగాలనుకోవడమేనా? లేదంటే బయటకు తెలియని మరేమైనా బలమైన కారణాలున్నాయా? అనే విషయాలు మాత్రం బయటకు రావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications