'గేమ్‌ఛేంజర్'కు రికార్డు స్థాయిలో కలెక్షన్లు తీసుకొచ్చిన శంకర్ మావ?
రామ్ చరణ్ కథానాయకుడిగా, భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం గేమ్ ఛేంజర్. తమకు కూడా ఒకేఒక్కడు, అపరిచితుడు, జంటిల్ మెన్, జీన్స్, రోబో లాంటి సినిమాలిస్తాడేమో అనే నమ్మకంతో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు అతి పెద్ద సాహసానికి పూనుకున్నాడు. రూ.450 కోట్ల భారీ బడ్జెట్ తో గేమ్ ఛేంజర్ ను మొదలుపెట్టారు. కియారా అద్వానీ, జయరాం, శ్రీకాంత్, అంజలి తదితర భారీ తారాగణాన్ని తీసుకోవడంతోపాటు భిన్నంగా తమన్ ను సంగీత దర్శకుడిగా శంకర్ ఎంచుకున్నారు. శంకర్ సినిమాలంటే కచ్చితంగా రెహమాన్ ఉండాల్సిందే. ఈసారి ఆనవాయితీ తప్పింది. సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో దీన్ని మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడు.
రూపాయి అంటే గౌరవం లేని శంకర్
విక్రమ్ సినిమా హిట్ కావడంతో మధ్యలోనే ఆగిపోయిన భారతీయుడు2ను పట్టాలెక్కించి పూర్తిచేయించి విడుదల చేశారు. శంకర్ దర్శకత్వంలోనే వచ్చిన ఆ చిత్ర రాజం దేశ చలనచిత్ర రంగంలో అత్యంత చెత్త సినిమాగా, భారీ డిజాస్టర్ గా మిగిలింది. తర్వాత వచ్చి గేమ్ ఛేంజర్ ను పూర్తిచేశాడు. ఎవరూ దీనిపై నమ్మకాలు పెట్టుకోలేదు. పాటలకే రూ.75 కోట్లు ఖర్చుపెట్టించాడు. నిర్మాతల డబ్బంటే ఏమాత్రం గౌరవం లేని శంకర్ రాజమౌళిని చూసి నేర్చుకోవాలి. వారు పెట్టే ప్రతి రూపాయిపై గౌరవముంచి దానికి న్యాయం చేస్తాడు. రూ.15 కోట్లు పెట్టి తీసిన పాట సినిమాలో లేదు. అడుగు ముందుకు వేసిన తర్వాత వెనక్కి రాలేని పరిస్థితి. సినిమా ఆడదన్న సంగతి అందరికీ తెలిసిపోయింది. కాకపోతే ఏదో ఒక రాయివేసి చూద్దాం అన్నట్లుగా విడుదల చేశారు. చివరకు ఆ రాయి కూడా తగల్లేదు.

నిర్మాతపై నెపాన్ని నెట్టిన శంకర్
దీనికితోడు నేను 5 గంటలు సినిమా తీశాను.. దిల్ రాజు ఒప్పుకోలేదంటూ నెపాన్ని నిర్మాతపై నెట్టేశాడు. కాలానికి అనుగుణంగా మారకుండా, నిర్మాతలచేత వందల కోట్లరూపాయలను మంచినీళ్లల్లా ఖర్చుచేయించే శంకర్ పరిశ్రమ నుంచి తప్పుకుంటే మంచిదని పలువురు సినీ విశ్లేషకులు హితవు పలుకుతున్నారు. అనవసరంగా ఇప్పుడు రజనీకాంత్ బయోపిక్ అంటూ ఏ నిర్మాతను ముంచడానికి సిద్ధమవుతున్నావని, ఎవరిచేత డబ్బును ఖర్చు చేయిస్తావంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. శంకర్ ను చూస్తేనే నిర్మాతలంతా భయపడుతున్నారు. గేమ్ ఛేంజర్ కు ఆరు రోజులకు గాను రూ.186 కోట్లు వచ్చింది. మొదటిరోజే వచ్చినట్లు పోస్టర్ విడుదల చేయడంతో ఇటువంటివి వద్దని, తనకిష్టముండదని హీరో రామ్ చరణ్ చెప్పడంతో ఆపేశారు. రూ.450 కోట్ల సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే వందల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి ఉంది. కానీ అటువంటి పరిస్థితి కనపడటంలేదు. సినిమా ఎక్కడా హిట్ అవలేదు. దిల్ రాజును నిండా ముంచేసిన శంకర్ మరో నిర్మాత నెత్తిపై చేయి పెట్టడానికి సిద్ధమవుతున్నాడు. పాపం.. ఆ దురదృష్టవంతుడెవరో అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.












Click it and Unblock the Notifications