Ranabaali Teaser: విజయ్ దేవరకొండ విశ్వరూపం.. శింగనమల బొబ్బిలి రణబాలి రా ని యక్కా..!!
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో 'రణబాలి' అనే మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన 'టాక్సీవాలా' మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. దాంతో ఈ మూవీపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో దాదాపు 1854 నుంచి 1878 మధ్య కాలంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతోంది.
అయితే తాజాగా రణబాలి చిత్రం నుంచి టీజర్ రిలీజ్ అయింది. 2 నిమిషాల 32 సెకన్ల పాటు ఉన్న టీజర్ ఉత్కంఠభరితంగా ఉంది. ఈ మూవీలో విజయ్ దేవరకొండ సింగనమల బొబ్బిలి రణబాలి గా విజయ్ దేవరకొండ శక్తివంతమైన పాత్రలో నటిస్తున్నారు. ఇది అన్నపూర్ణ దేశంరా.. అన్నానికి కరువైంది.. ఇదంతా మన భూమిని మింగడానికి ఏడు సముద్రాలు దాటొచ్చిన ఆ కరుడు రాక్షసుడి ఆకలి అనే డైలాగ్స్ ఆకట్టుకున్నాయి.

ఈ మూవీలో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా ఆయన సతీమణి రష్మిక మందన్న నటిస్తోంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 16 న విడుదలకు సిద్ధం అవుతోంది. రణబాలి మూవీలో హాలీవుడ్ కు చెందిన ప్రముఖ అమెరికన్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ విలన్ గా శక్తివంతమైన పాత్రలో నటిస్తున్నారు. ఇక విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న ల వివాహం తర్వాత కలిసి చేస్తున్న ఫస్ట్ సినిమా ఇదే కావడం విశేషం. స్క్రీన్ పై వీరిద్దరి కెమిస్ట్రీని చూసేందుకు ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
రాయలసీమ కరవు బ్యాక్ డ్రాప్ లో రణబాలి చిత్రం సాగుతుందని ఇటీవల దర్శకుడు రాహుల్ చెప్పిన సంగతి తెలిసిందే. రాయలసీమలో నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన ఓ యోధుడి కథే రణబాలి అని తెలిపారు. రణబాలి మూవీని టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై వై. రవిశంకర్, నవీన్ యెర్నేని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీతో విజయ్ దేవరకొండ బిగ్గెస్ట్ హిట్ కొట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications
