Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పాకిస్థాన్ ను షేక్ చేస్తున్న 'ధురంధర్'.. రికార్డు వ్యూస్ తో..

బాలీవుడ్ హీరో రణ్ వీర్​ సింగ్, ఆదిత్య ధర్​ కాంబోలో తెరకెక్కిన 'ధురంధర్' సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. రూ. 280 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసింది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా గతేడాది డిసెంబర్ 5 న విడుదల అయింది. థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత ఈ సినిమా 2026 జనవరి 30 నుంచి నెట్‌ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ డైరెక్షన్ లో వచ్చిన మూవీ ధురంధర్.. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ. 1200 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇక భారత్​ లో అత్యధిక నెట్ వసూళ్లు సాధించిన సినిమాగా 'ధురంధర్' రెండో స్థానంలో కొనసాగుతోంది. ఈ లిస్టులో పుష్ప 2 టాప్​ లో దూసుకెళ్తోంది. 2024లో రిలీజైన పుష్ప 2 భారత్​ లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా అగ్రస్థానంలో ఉంది. ఈ సినిమా ఒక్క భారత్​ లోనే రూ. 730 కోట్ల నెట్​ వసూళ్లను రాబట్టింది.

ఇక ధురంధర్ మూవీపై విడుదల సమయంలో పాకిస్థాన్ ప్రభుత్వం నిషేధం విధించింది. ముఖ్యంగా పాక్‌ నిజ స్వరూపాన్ని బహిర్గతం చేసే ధురంధర్ లాంటి చిత్రాలకు థియేటర్లలో అనుమతి ఇవ్వలేదు. దాంతో ఆ సమయంలో చాలామంది ఈ మూవీని వీక్షించలేకపోయారు. అయితే ఇటీవల ఈ మూవీ ఓటీటీలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ రోజు నుంచి పాకిస్థాన్ లో ఈ మూవీ ట్రెండింగ్ అవుతోంది. ఈ సినిమా పాకిస్థాన్‌ లో టాప్‌ వ్యూస్, వాచ్‌ అవర్స్‌ సాధించడం విశేషం.

ranveersingh bollywood star Dhurandhar Explodes in Pakistan Record Netflix Views amp amp Trending1

ఇక ఈ మూవీకి పాకిస్థాన్ నుంచి విశేష ఆదరణ వస్తోంది. పాకిస్థాన్‌ ప్రజలు ఈ మూవీ చూసి సినిమా చాలా రియలిస్టిక్‌ గా, ఆకర్షణీయంగా ఉందంటూ మెచ్చుకుంటున్నారు. సాధారణ చిత్రాల కంటే ఈ మూవీ భిన్నంగా ఉందని చెబుతున్నారు. అయితే ఈ సినిమాలో రణ్ వీర్ సింగ్​ తో పాటుగా బాలీవుడ్ సీనియర్ నటుడు అక్షయ్​ ఖన్నా, ఆర్​ మాధవన్​, అర్జున్​ రాంపాల్​, సంజయ్​ దత్​, సారా అర్జున్, రాకేష్​ బేడీ, మానవ్​ గోహిల్​ తదితరులు ఆయా పాత్రలు పోషించారు. శాశ్వత్​ సచ్​దేవ్​ సంగీతం అందించారు. జియో స్టూడియోస్​, బి62 స్టూడియోస్​ బ్యానర్లపై ఆదిత్య ధర్, లోకేష్​ ధర్​ సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీకి సంబంధించిన పార్ట్ 2 ఈ ఏడాది మార్చి 19 న రిలీజ్ కానుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+