రిటైర్మెంట్ పై రష్మిక షాకింగ్ కామెంట్స్..
నేషనల్ క్రష్ రష్మిక మందాన సంచలన కామెంట్స్ చేశారు. తాజాగా ఛావా మూవీ ప్రెస్ మీట్ లో పాల్గొన్న రష్మిక.. సినిమాలోని మహారాణి ఏసుభాయి పాత్ర తనకు దక్కడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
ఈ పాత్ర తర్వాత తాను సినిమాలను కూడా సంతోషంగా మానేస్తానని.. అంతలా ఆ పాత్ర తనకు సంతృప్తిని ఇచ్చిందని అన్నారు. " సౌత్ ఇండియా నుంచి వచ్చిన ఓ నటికి మహారాణి ఏసుభాయి పాత్ర ఇవ్వడం గౌరవంగా భావిస్తున్నా. నా జీవితంలో ఈ పాత్ర స్పెషల్ లా మిగిలిపోతుంది. డైరెక్టర్ లక్ష్మణ్ కు కూడా ఇదే చెప్పాను. ఈ చిత్రం తర్వాత హ్యాపీగా రిటైరయినా సంతోషమేనని" అని చెప్పుకొచ్చారు. విక్కీ ఈ సినిమాలో దేవుడిలా ఉన్నాడని ప్రశంసించారు.

డైరెక్టర్ డెసిషన్ కు షాక్..
ఏసుభాయి పాత్ర కోసం డైరెక్టర్ లక్షణ్ తనను సంప్రదించడంపై ఇప్పటికీ షాకింగ్ లోనే ఉన్నానని అన్నారు. ఇలాంటి పాత్రకోసం తనను తీసుకోవాలని డైరెక్టర్ కు ఎలా అనిపించిందని ఆలోచనలో పడినట్లు చెప్పుకొచ్చారు. ఏమీ ఆలోచించకుండా పూర్తిగా డైరెక్టర్ కు పూర్తిగా సరెండర్ అయి చెప్పిందే చేశానని రష్మిక అన్నారు. 'ఈ పాత్ర కోసం ఎన్నో రిహార్సల్స్ చేశా. టీమ్ అంతా ఎంతో సహకరించింది. ఇందులోని పాత్రలు అందరినీ ప్రభావితం చేస్తాయి' అని రష్మిక చెప్పారు.
బాలీవుడ్ యాక్టర్ విక్కీ కౌశల్ ఈ సినిమాలో ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ కుమారుడి పాత్రలో నటిస్తున్నారు. రష్మిక మహారాణి ఏసుభాయి పాత్రలో నటిస్తుండగా.. అశుతోష్ రాణా, దివ్యా దత్తా, నీల్ భూపాలమ్, సంతోష్ జువేఖర్, ప్రదీప్ రావత్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ఏ ఆర్ రహమాన్ సంగీతం అందించగా.. మద్ధోక్ ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ నిర్మాతగా వ్యవహరించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఫిబ్రవరి 14న విడుదల కానుంది.












Click it and Unblock the Notifications