రష్మిక మరో మార్పింగ్ వీడియో... ఫిర్యాదులు చేస్తున్న అభిమానులు..
టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్నా డీప్‌ఫేక్ వీడియో దేశవ్యాప్తంగా సంచనలనం సృష్టించింది. ఆ వీడియో మీద చాలా ఫిర్యాదులు కూడా వెళ్లాయి. దీనిపై చాలామంది సినీ, రాజకీయ ప్రముఖులు కూడా స్పందించడం జరిగింది. అయితే ఇదే వీడియోపై రష్మిక కూడా స్పందించారు. ఈ వీడియో తనను చాలా భాదించిందని రష్మిక చెప్పుకొచ్చింది. తన ఫేక్ వీడియో గురించి ఇలా మాట్లాడాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదని, ఈ విషయం తనకెంతో భయం కలిగించదని రష్మిక చెప్పుకొచ్చింది. ఒక మహిళగా, నటిగా, నాకు మద్ధతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అంటూ రష్మిక తన సోషల్ మీడియాలోని ఓ ఖాతాలో పోస్ట్ కూడా చేయడం జరిగింది.
మరో మార్పింగ్ వీడియో : అయితే, ఈ ఘటన గురించి మరువక ముందే రష్మికకు మరో చేదు అనుభవం ఎదురైంది. ఆమెకు సంబంధించిన మరో మార్ఫింగ్ వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీంతో ఆమె అభిమానులు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇది కూడా ఫేక్ వీడియో అని రష్మిక అభిమానులు ఫిర్యాదులు చేయడం మొదలుపెట్టారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి కొందరు దుండగులు ఇలాంటి వీడియోలను క్రియేట్ చేస్తున్నారు.

అయితే ఇంతకుముందు వైరల్ అయిన రష్మిక వీడియోపై పోలీసులు కేసు కూడా నమోదు చేసినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంపై సీరియస్ అయినా సంగతి తెలిసిందే. అయినా, మళ్లీ మరో మార్పింగ్ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ చెక్కర్లు కొడుతుండడం కాస్త ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రష్మిక వీడియో తర్వాత బాలీవుడ్ నటి కత్రీనాకైఫ్ ఫొటోలను కూడా మార్ఫింగ్ చేశారు. ఆమె తాజాగా నటించిన చిత్రం టైగర్ 3. ఈ సినిమాలోని ఫైట్ సీన్లలోని ఫోటోలను కొందరు మార్ఫింగ్ చేశారు. ఇప్పుడు ఆ ఫొటోలు కూడా సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!!












Click it and Unblock the Notifications