Ravi Teja: వరుస ఫ్లాపులతో రవితేజ ఊహించని నిర్ణయం.. ఇకపై..!

మాస్ మహారాజ రవితేజ అంటే ఒకప్పుడు మినిమమ్ గ్యారంటీ సినిమా అనేవారు. ఎలాంటి సీనీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రవితేజ అంచలంచెలుగా ఎదుగుతూ స్టార్ హీరోగా మారారు. కెరీర్ బిగినింగ్ లో కర్తవ్యం, సింధూరం, నిన్నే పెళ్లాడతా తదితర చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేశారు రవితేజ. ఆ తర్వాత 1999లో తొలిసారిగా శ్రీను వైట్ల దర్శకత్వంలో నీకోసం సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం సినిమా చేశారు. ఇక 2002 లో వచ్చిన ఇడియట్ మూవీ రవితేజకు బిగ్ టర్నింగ్ పాయింట్. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది.

ఆ తర్వాత అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమా కూడా సూపర్ సక్సెస్ అయింది. ఇక వెంకీ, విక్రమార్కుడు, కిక్ సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలను సాధించాయి. ఆ తర్వాత బలుపు, పవర్, రాజా ది గ్రేట్, క్రాక్, ధమాకా లాంటి విజయాలతో దూసుకెళ్లారు. కానీ ఇటీవలి కాలంలో రవితేజ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్స్ రాబట్టడం లేదు. ఇటీవల విడుదలైన భర్త మహాశయులకు విజ్ఞప్తి, మాస్ జాతర, మిస్టర్ బచ్చన్, ఈగల్ సినిమాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో విఫలమయ్యాయి.

RaviTeja Slashes Remuneration After Series of Flops Tollywood Sources Confirm Major Decision

దాంతో రవితేజ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఒకప్పుడు సినిమా కోసం రూ.25 కోట్ల వరకు పారితోషికం తీసుకున్న రవితేజ, ప్రస్తుతం తన రెమ్యూనరేషన్‌ను రూ.15 కోట్లకు తగ్గించుకున్నారని తెలుస్తోంది. వరుస ప్లాఫ్ ల కారణంగా నిర్మాతలపై అదనపు భారం పడకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని టాలీవుడ్ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది. ఇక ప్రస్తుతం రవితేజ ఇరుముడి అనే చిత్రం చేస్తున్నారు. ఈ మూవీని శివ నిర్వాణ తెరకెక్కిస్తున్నారు. అయితే ఇరుముడి తో రవితేజ కమ్ బ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+