సీఎం విజయ్ పై ప్రశ్నకు రజనీకాంత్ ఊహించని రియాక్షన్..!!

తమిళ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి విజయ్ అసెంబ్లీ లో రేపు బల పరీక్ష ఎదుర్కోబోతున్నారు. పూర్తి సంఖ్యా బలం ఉన్న విజయ్ కు ఇప్పుడు పరోక్షంగా అన్నా డీఎంకే చీలిక వర్గం మద్దతు అందిస్తోంది. ముఖ్యమంత్రి విజయ్ కొత్త నిర్ణయాలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు సీఎంగా బాధ్యతలు చేపట్టిన విజయ్ కు అభినందనలు చెప్పారు. కాగా.. సూపర్ స్టార్ రజనీకాంత్ సీఎం అయిన విజయ్ గురించి ప్రశ్నించగా అనూహ్యంగా స్పందించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియోలో వైరల్ అవుతోంది.

ఎన్నికల్లో విజయం సాధించిన నాటి నుంచి ముఖ్యమంత్రి అయ్యే వరకు విజయ్ కు పలు రంగాల ప్రముఖుల నుంచి అభినందనలు అందాయి. అందులో తమిళ సినీ ప్రముఖులు ఉన్నారు. తాజా గా ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచిన విజయ్ ను రజనీ కాంత్ సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలిపారు. విజయ్ ప్రభుత్వం ఏర్పాటు.. సంఖ్య బలం పైన సస్పెన్స్ కొనసాగుతున్న వేళ రజనీ కాంత్ మాజీ సీఎం స్టాలిన్ తో సమావేశం అయ్యారు. ఈ భేటీ ఆ సమయంలో రాజకీయంగా ఉత్కంఠ పెంచింది. ఆ తరువాత సంఖ్యా బలం దక్కటంతో విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసారు. కొత్త నిర్ణయాలు మొదలు పెట్టారు. సీఎం అయిన తరువాత మాజీ సీఎం స్టాలిన్, వైగో తోనూ ప్రత్యేకంగా విజయ్ భేటీ అయ్యారు. ఇది తమిళనాడు రాజకీయాల్లో సంచలనంగా మారింది.

విజయ్ కార్ల నెంబర్ 0277 వెనుక ఎమోషనల్ స్టోరీ, తెలిస్తే కన్నీళ్లు ఆగవు..!!
విజయ్ కార్ల నెంబర్ 0277 వెనుక ఎమోషనల్ స్టోరీ, తెలిస్తే కన్నీళ్లు ఆగవు..!!
rajinikanth-chooses-silence-this-time-after-previously-congratulating-vijay-post-tamil-nadu-electio

https://twitter.com/AVinthehousee/status/2054072055390408732

విజయ్ స్పందన పైన సోషల్ మీడియాలో చర్చ

కాగా.. సూపర్ స్టార్ రజనీ కాంత్ సీఎం గా విజయ్ బాధ్యతలు చేపట్టిన తరువాత స్పందించ లేదు. రజనీకాంత్ ఈ రోజు (మంగళవారం) చెన్నై విమానాశ్రయంలో కనిపించారు. ఆయన రిషికేశ్ వెశ్తున్నట్లు సమాచారం. కాగా, విజయ్ గురించి అక్కడ ఉన్న మీడియా రజనీకాంత్ కు ప్రశ్నలు సంధించింది. ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు స్వీకరించడం గురించి విలేకరులు రజనీని ప్రశ్నించారు. దీనిపై ఆయన అభిప్రాయం ఏంటని అడిగారు. అయితే, ఈ ప్రశ్నకు రజనీకాంత్ ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. సింపుల్ గా ఒక చిరునవ్వు.. నమస్కారం చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫలితాలు వచ్చిన తరువాత స్టాలిన్ కలిసిన రజనీకాంత్ .. సీఎం అయిన విజయ్ ను అభినందించ లేరా అంటూ పోస్టింగ్స్ కనిపిస్తున్నాయి. సినీ ప్రముఖుల అనేక మంది విజయ్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత అభినందనలు తెలిపారు. ఇప్పుడు రజనీకాంత్ స్పందించకపోవటం పైన పెద్ద ఎత్తున పొలిటికల్ - సినీ సర్కిల్స్ లో చర్చ సాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+