నవంబర్ 20న థియేటర్లలోకి పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్!
కార్తిక్ జయంతి హీరోగా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పరిచయమవుతున్న వినూత్న యాక్షన్ ఎంటర్టైనర్ "రాయవలస". రాధిక జయంతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను RaysuN ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాత గోపీ కృష్ణ జె ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. డెబ్యూ హీరో అయినప్పటికీ కార్తిక్ జయంతి పవర్‌ఫుల్, ఇంటెన్స్ లుక్‌తో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు.
తాజాగా ఈ చిత్ర యూనిట్ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. ఈ పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాను నవంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. రిలీజ్ డేట్ సందర్భంగా విడుదల చేసిన ప్రత్యేక పోస్టర్లో కార్తిక్ జయంతి చేతిలో త్రిశూలం పట్టుకుని అమ్మవారం విగ్రహం ముందు నిలబడి ఉన్న దృశ్యం ఎంతో పవర్‌ఫుల్‌గా, భక్తి, మాస్ ఎలిమెంట్స్ మేళవింపుగా ఉంది. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ సినిమాలో కార్తిక్ జయంతికి జోడీగా శ్రీష నులు హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే సీనియర్, నూతన నటీనటుల కలయికతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. అన్నపూర్ణమ్మ, అనిత చౌదరి, జయప్రకాశ్, రవి వర్మ, కాశీ విశ్వనాథ్ వంటి సీనియర్ నటులతో పాటు త్రినాధ్ రావు, సుహాస్, కంచరపాలెం రాజు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రతి ఒక్కరి పాత్ర కథను మలుపు తిప్పే విధంగా డిజైన్ చేసినట్లు చిత్ర బృందం తెలిపింది.
ఈ చిత్రానికి అర్జున్ బాలా సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. పూర్ణ చారి, కార్తిక్ జయంతి, తరుణ్ సైదులు లిరిక్స్ అందించగా.. రాహుల్ సిప్లిగంజ్, ధనుంజయ్, రోహిత్ పరిటాల, రమ్య బెహరా, సాహితి చాగంటి, సౌజన్య భగవతుల, వాగ్దేవి, అర్జున్, కార్తిక్ జయంతి వంటి ప్రముఖ గాయకులు పాటలను ఆలపించారు. భావోద్వేగం, యాక్షన్, సంగీతం కలగలిపిన కంప్లీట్ ఎంటర్‌టైనర్‌గా "రాయవలస" ప్రేక్షకులను అలరించనుంది.
వీఆర్కే నాయుడు(కిట్టు) సినిమాటోగ్రఫీ, గ్యారీ బీహెచ్ ఎడిటింగ్, మల్లేశ్ షాలియోన్ ఫైట్స్, రాజ్ పైడే కొరియోగ్రఫీ ఈ సినిమాకు మరింత సాంకేతిక బలాన్ని చేకూర్చాయి. ఈ సినిమా నవంబర్ 20న థియేటర్లలో బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధంగా ఉంది.













Click it and Unblock the Notifications
