నిప్పు రాజేసిన బాలయ్య... భగ్గుమన్న నాగార్జున!
నందమూరి నటసింహం బాలకృష్ణ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 50 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా హైదరాబాద్ నోవాటెల్ లో అంగరంగ వైభోగంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. అగ్ర కథానాయకులు చిరంజీవి, వెంకటేష్ తోపాటు యువ కథానాయకులు నాని, రానా, విజయ్ దేవరకొండలాంటివారంతా హాజరయ్యారు. ప్రముఖ నిర్మాత, దర్శకులు, సీనియర్ నటీమణులు, సంగీత దర్శకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే అందరూ వస్తారని ఎదురుచూసిన స్టార్ హీరో మాత్రం రాలేదు. ఆయన ఎవరో కాదు.. అక్కినేని నాగార్జున.
ఆహ్వానం అందుకున్న నాగార్జున
బాలయ్య వేడుకకు రావాలని నాగార్జునకు కూడా ఆహ్వానం అందింది. అందరూ ఆయన వస్తారని అనుకున్నారు. తీరా నాగార్జున రాకుండా బాలయ్యతోపాటు నిర్వాహకులకు కూడా షాక్ ఇచ్చారు. నాగార్జున ఒక్కడే కాదు.. అక్కినేని కుటుంబం నుంచి నాగచైతన్య, అఖిల్, సుమంత్, సుశాంత్, నాగార్జున సోదరుడు అక్కినేని వెంకట్, నిర్మాత యార్లగడ్డ సుప్రియ లాంటివారు కూడా గైర్హాజరయ్యారు. వీరంతా కావాలనే రాలేదని సామాజిక మాధ్యమాల్లో వార్త వైరలవుతోంది. వాస్తవానికి నాగార్జునకు, బాలయ్యకు కొంతకాలం నుంచి విభేదాలు నడుస్తున్నాయి. ఇన్ని విభేదాల నడుమ మధ్య ఆయన వస్తారని ఎవరూ అనుకోలేదు. వాటినే నాగార్జున నిజం చేశారు.

దూరం పెరగడానికి బాలయ్యే కారణం
నందమూరి, అక్కినేని కుటుంబాల మధ్య దూరం పెరగడానికి బాలయ్యే కారణమని వార్తలు వస్తున్నాయి. వీరిద్దరి మధ్య గొడవలకు కారణాలు తెలియరానప్పటికీ ఓ వేడుకలో బాలకృష్ణ అక్కినేని నాగార్జునను అవమానించేవిధంగా మాట్లాడారు. అక్కినేని, గిక్కినేని అంటూ మాటలు తూలారు. దీంతో అక్కినేని అభిమానులు బాలయ్యపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మర్యాదగా మాట్లాడాలంటూ హెచ్చరించారు. దీనిపై అప్పట్లోనే బాలకృష్ణ వివరణ ఇచ్చారు. ఆ తర్వాత ఇంతవరకు బాలయ్యకానీ, నాగార్జున కానీ ఎక్కడా ఎదురుపడలేదు. బాలయ్య చేసిన ఈ కామెంట్లవల్లే ఈ వేడుకలో నాగార్జున కనిపించలేదని, గైర్హాజరయ్యారని విశ్లేషకులు అంటున్నారు. ఇందులో ఎంత నిజం ఉందో వారిద్దరికే తెలియాలి.












Click it and Unblock the Notifications