ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి!

ప్రస్తుత కాలంలో మధ్యతరగతి మనిషి జీవితం అంతా అప్పులు, కిస్తీలు , ఆర్థిక ఇబ్బందుల చుట్టూనే తిరుగుతోంది. సరిగ్గా ఇదే పాయింట్‌ను స్పృశిస్తూ, గుండెకు హత్తుకునే ఎమోషన్స్‌తో తెరకెక్కిన చిత్రం "కార్మేని సెల్వం". పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మించిన ఈ చిత్రానికి రామ్ చక్రి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఏప్రిల్ 3న తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. తాజాగా జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో చిత్ర యూనిట్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

డబ్బు చుట్టూ తిరుగుతున్న ప్రపంచం
ట్రైలర్ లాంచ్ సందర్భంగా అతిథిగా వచ్చిన 'సేవ్ ద టైగర్స్' ఫేమ్ తేజ కాకుమాను మాట్లాడుతూ.. భూమి సూర్యుని చుట్టూ తిరగడం ఆగిపోయిందేమో కానీ, మనిషి మాత్రం డబ్బు చుట్టూ తిరగడం మానలేదు అంటూ నేటి సమాజ పరిస్థితిని కళ్లకు కట్టారు. విమానం దర్శకుడు శివ ప్రసాద్ మాట్లాడుతూ..మిడిల్ క్లాస్ ఫాదర్ పాత్రలకు సముద్రఖని గారు కేరాఫ్ అడ్రస్ అని, ఈ సినిమా ప్రతి కుటుంబానికి కనెక్ట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

Reduce your EMIs after watching Karmani Selvam says Actor Samuthirakani Full Details

సముద్రఖని ఏమన్నారంటే?
విలక్షణ నటుడు సముద్రఖని ఈ సినిమా గురించి చెబుతూ.. మనపై ఉన్న ఆర్థిక భారాలను, అప్పులను తగ్గించుకుంటేనే మన కలలను నెరవేర్చుకోగలం. ఈ సినిమా చూసి బయటకు వచ్చాక ప్రతి ఒక్కరూ తమ ఈఎమ్‌ఐలను తగ్గించుకోవాలని ఆలోచిస్తారు. ప్రతి ఒక్కరూ సంపన్నంగా, సంతోషంగా ఉండాలని ఆకాంక్షించే చిత్రమిది అని పేర్కొన్నారు.

ప్రతి ఇంట్లో ఉండే కథ
దర్శకుడు రామ్ చక్రి ఈ చిత్రాన్ని ఒక బాధ్యతగా తెరకెక్కించారు. సముద్రఖని గారితో పాటు గౌతమ్ వాసుదేవ్ మీనన్, లక్ష్మీ ప్రియా, అభినయ వంటి ప్రతిభావంతులైన నటీనటులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా భారీ స్థాయిలో విడుదలవుతున్న ఈ చిత్రం, మధ్యతరగతి ప్రేక్షకుల మనసు గెలుచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+