రెండో పెళ్లిపై సంచలన ప్రకటన చేసిన రేణు దేశాయ్

సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో బాగా వినిపిస్తోన్న సెలబ్రిటీలలో రేణు దేశాయ్ కూడా ఒకరు. పవన్ కల్యాణ్‌తో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్‌ తన ఇద్దరి పిల్లలతో పుణేలో సెటిల్ అయ్యారు. ఇండస్ట్రీకి దూరం అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూనే ఉంటున్నారు.ఇదే సమయంలో తనని ట్రోల్ చేసి వారికి సైతం ఆమె తనదైనరీతిలో సమాధానం ఇస్తున్నారు. పవన్‌తో విడాకులపై ఆయన అభిమానులు పలుమార్లు రేణు దేశాయ్‌‌ను ఇబ్బంది పెట్టడం జరిగింది.

పవన్‌కు విడాకులు ఇచ్చి తప్పు చేశారని ఓ నెటిజన్ కామెంట్ చేయగా, మా పవన్ అన్నయ్యలాగా గొప్ప మనసు ఉన్నవారు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. వీరిపై చేసిన కామెంట్స్‌పై రేణు దేశాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పవన్‌ను నేను వదిలేయలేదని..ఆయనే నన్ను వదిలేసి మరో అమ్మాయిని వివాహం చేసుకున్నారని చెబుతూ వారికి స్ట్రాంగ్ కౌంటరిచ్చారు.ఇదే సమయంలో సమాజంలో జరుగుతున్న తప్పులపై రేణు దేశాయ్‌ ఎప్పటికప్పుడు తనదైన శైలిలో స్పందిస్తుంటారు.

Renu Desai Key Comments on Her Second Marriage

పవన్ కల్యాణ్‌తో విడాకులు తర్వాత ఆమె రెండో పెళ్లి చేసుకోవాలని భావించారు. కానీ ఆ సమయంలో పవన్ అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో ఆమె తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. తన రెండో పెళ్లిపై రేణు దేశాయ్ స్పందించారు. తన రెండో పెళ్లి గురించి అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారని ఆమె తెలిపారు. నేను నా వివాహం గురించి వందసార్లు మాట్లాడగలను. ఎందుకంటే ఇది ఖచ్చితంగా నా జీవితాన్ని, నా సన్నిహిత కుటుంబాన్ని ప్రభావితం చేస్తుంది.

పిల్లలు తనని రెండో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని రేణు దేశాయ్ తెలిపారు. అయితే వారు ఇప్పటికే తండ్రికి దూరంగా ఉంటున్నారు. ఇటువంటి సమయంలో నేను రెండో పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదని అనిపించి ఆగిపోతున్నా అని ఆమె చెప్పుకొచ్చారు.పిల్లలు సెటిల్ అయిన తర్వాత తాను కూడా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తానని రేణు దేశాయ్ వెల్లడించారు. అప్పుడు స్వేచ్ఛగా నా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తానని ఆమె పేర్కొన్నారు.అప్పుడే నా జీవితాన్ని ఆనందించగలుగుతానని రేణు దేశాయ్ చెప్పారు. ప్రస్తుతం తన పిల్లలు కెరీర్ మీద దృష్టి సారించానని, వాళ్లను ఓ దారి చేర్చిన తర్వాత తన రెండో పెళ్లిపై ఓ నిర్ణయం తీసుకుంటానని రేణు దేశాయ్ గతంలో తెలిపారు.

ఇక రేణు దేశాయ్ విషయానికి వస్తే.. రేణు దేశాయ్‌ చాలాకాలం తర్వాత తెలుగు సినిమాలో నటించారు. రేణు దేశాయ్ ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేశారు. రవితేజ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో రేణు దేశాయ్‌ ఓ ముఖ్య పాత్రలో నటించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బొల్తా కొట్టింది. ఇక ఇటీవలే ఆమె తన తర్వాత సినిమా గురించి కీలక ఆప్డేట్ ఇచ్చారు. ఏడాది తర్వాత మళ్లీ మేకప్ వేసుకుంటున్నానంటూ తన కొత్త సినిమా గురించి అధికారికంగా ప్రకటించారు. అయితే ఎవరి సినిమాలో నటిస్తుందో మాత్రం వెల్లడించలేదు. మొత్తానికి ఏడాది తర్వాత రేణు దేశాయ్ తిరిగి సినిమాల్లో నటించడానికి సిద్ధం కావడంతో ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+