రేణు దేశాయ్ షాకింగ్ పోస్ట్.. కొత్త జర్నీ మొదలుపెట్టానంటూ
సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో బాగా వినిపిస్తోన్న సెలబ్రిటీలలో రేణు దేశాయ్ కూడా ఒకరు. పవన్ కల్యాణ్‌తో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ తన ఇద్దరి పిల్లలతో పుణేలో సెటిల్ అయ్యారు. ఇండస్ట్రీకి దూరం అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూనే ఉంటున్నారు.ఇదే సమయంలో తనని ట్రోల్ చేసి వారికి సైతం ఆమె తనదైనరీతిలో సమాధానం ఇస్తున్నారు. పవన్‌తో విడాకులపై ఆయన అభిమానులు పలుమార్లు రేణు దేశాయ్‌ను ఇబ్బంది పెట్టడం జరిగింది.
పవన్‌కు విడాకులు ఇచ్చి తప్పు చేశారని ఓ నెటిజన్ కామెంట్ చేయగా, మా పవన్ అన్నయ్యలాగా గొప్ప మనసు ఉన్నవారు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. వీరిపై చేసిన కామెంట్స్‌పై రేణు దేశాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పవన్‌ను నేను వదిలేయలేదని..ఆయనే నన్ను వదిలేసి మరో అమ్మాయిని వివాహం చేసుకున్నారని చెబుతూ వారికి స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. ఇదే సమయంలో సమాజంలో జరుగుతున్న తప్పులపై రేణు దేశాయ్ ఎప్పటికప్పుడు తనదైనశైలిలో స్పందిస్తుంటారు. ఇటీవలే ఓ యువకుడు కుక్కను గిరగిరా తిప్పి అవతల పడేసిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అయింది. ఆ వీడియోపై రేణు దేశాయ్ రియాక్ట్ అయ్యారు. ఆ వీడియోను షేర్ చేస్తూ...అతని అడ్రస్, ఫోన్ నెంబర్ చెప్పాలంటూ పోస్ట్ షేర్ చేశారు.

కుక్కను వేధించిన వ్యక్తి అరెస్ట్ అయ్యే వరకు రేణు దేశాయ్ వదిలిపెట్టలేదు. జంతువులను హింసిస్తే రేణు దేశాయ్ వేగంగా స్పందిస్తుంటారు. ఇక రేణు దేశాయ్ పలు ఎన్జీవోలను నడుపుతున్నారు. తద్వారా జంతువులతో పాటు, అనాథ ఆశ్రమాలకు సైతం ఆమె సాయం చేస్తుంటారు. ఈ విషయంలో రేణు దేశాయ్ తాజాగా మరో అడుగు ముందుకేశారు. దీనికి సంబంధించి ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో విడుదల చేశారు.
ఈ రోజు నా జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజు ఎందుకంటే నా చిన్ననాటి కల నెరవేరింది మరియు ఈ క్షణాన్ని మీ అందరితో పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉందంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. నా సొంతంగా అంబులెన్స్, బ్యాంక్ అకౌంట్‌ను సంపాదించాను. నన్ను నమ్మి నా కొత్త జర్నీకి సపోర్ట్ చేయండి. 'శ్రీ ఆద్య యానిమల్ షెల్టర్' అని ఇన్‌స్టా అకౌంట్ ఓపెన్ చేశాను. పేజ్‌ను ఫాలో అవండి. అయితే అందరికీ నేనొక రిక్వెస్ట్ చేస్తున్నాను. రూ. 500 అయినా సరే డొనేట్ చేయండి. నెలకు కనీసం రూ. 100 అయిన విరాళం ఇవ్వండి అది నాకు పెద్ద సహాయం. మీరు ఇచ్చిన డబ్బుల్లో ఒక్క రూపాయి కూడా ఎక్కడికి పోదు. నేను నా సొంత డబ్బుతో హాస్పిటల్ కట్టిస్తాను. కానీ కొంత సమయం పడుతుందంటూ రేణు దేశాయ్ ఓ వీడియో విడుదల చేశారు. దీంతో నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం రేణు దేశాయ్ షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications