అతను కచ్చింతంగా నరకానికి పోతాడు - రేణు దేశాయ్
సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో బాగా వినిపిస్తోన్న సెలబ్రిటీలలో రేణు దేశాయ్ కూడా ఒకరు. పవన్ కల్యాణ్‌తో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ తన ఇద్దరి పిల్లలతో పుణేలో సెటిల్ అయ్యారు. ఇండస్ట్రీకి దూరం అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూనే ఉంటున్నారు.ఇదే సమయంలో తనని ట్రోల్ చేసి వారికి సైతం ఆమె తనదైనరీతిలో సమాధానం ఇస్తున్నారు. పవన్‌తో విడాకులపై ఆయన అభిమానులు పలుమార్లు రేణు దేశాయ్‌ను ఇబ్బంది పెట్టడం జరిగింది.
పవన్‌కు విడాకులు ఇచ్చి తప్పు చేశారని ఓ నెటిజన్ కామెంట్ చేయగా, మా పవన్ అన్నయ్యలాగా గొప్ప మనసు ఉన్నవారు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. వీరిపై చేసిన కామెంట్స్‌పై రేణు దేశాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పవన్‌ను నేను వదిలేయలేదని..ఆయనే నన్ను వదిలేసి మరో అమ్మాయిని వివాహం చేసుకున్నారని చెబుతూ వారికి స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. ఇదే సమయంలో సమాజంలో జరుగుతున్న తప్పులపై రేణు దేశాయ్ ఎప్పటికప్పుడు తనదైనశైలిలో స్పందిస్తుంటారు. ఇటీవలే ఓ యువకుడు కుక్కను గిరగిరా తిప్పి అవతల పడేసిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అయింది. ఆ వీడియోపై రేణు దేశాయ్ రియాక్ట్ అయ్యారు. ఆ వీడియోను షేర్ చేస్తూ...అతని అడ్రస్, ఫోన్ నెంబర్ చెప్పాలంటూ పోస్ట్ షేర్ చేశారు.

కుక్కను వేధించిన వ్యక్తి అరెస్ట్ అయ్యే వరకు రేణు దేశాయ్ వదిలిపెట్టలేదు. జంతువులను హింసిస్తే రేణు దేశాయ్ వేగంగా స్పందిస్తుంటారు. తాజాగా ఆమె మరో వివాదంపై రియాక్ట్ అయ్యారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా రేణు దేశాయ్ ఓ వీడియోను షేర్ చేశారు.ఆ వీడియోలో కొంతమంది . అమ్మవారికి జంతు బలి చేస్తూ కనిపించారు. ఈ వీడియోపై రేణు దేశాయ్ రియాక్ట్ అవుతూ..ఇలా బలి ఇచ్చి చంపేస్తే దేవత, దేవుడు సంతోషిస్తాడని ఈ పిచ్చి జనాలు ఎలా నమ్ముతున్నారు. బిడ్డల రక్తం కళ్ల చూస్తే ఏ తల్లి సంతోషిస్తుంది. ఇలాంటి పనులు చేసే వారికి నరకంలో చోటు దక్కుతుంది. ఆ దేవుడు కూడా క్షమించరంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. ప్రస్తుతం రేణు దేశాయ్ షేర్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications