సినిమాలు వదిలేసి సన్యాసిగా మారిన RGV హీరోయిన్.. కారణం తెలిస్తే షాక్..?

సినిమా ఇండస్ట్రీలో ఉన్నంత కాలం సూపర్ హిట్స్ కొట్టింది. ఎన్నో అవార్డులు వరించాయి. రూ. కోట్లలో రెమ్యూనరేషన్ కూడా తీసుకుంది. కానీ అవేవీ ఆమెను సంతృప్తి పరచలేదు. దీంతో ఎవరూ ఊహించని సంచలన నిర్ణయం తీసుకుంది. అన్నీ వదిలేసి సన్యాసిగా మారింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..?

చాలా మంది సెలబ్రిటీలు ఇండస్ట్రీలో ఉన్నంత కాలం వెలుగు వెలుగుతారు. ఆ తర్వాత బిజినెస్, రాజకీయాలు అంటూ వెళ్లిపోతారు. మరి కొంతమంది వయసుకు తగ్గట్లు చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ కాలం వెళ్లదీస్తారు. కానీ ఓ హీరోయిన్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. అందరూ వెళ్లే దారిలో కాకుండా కొత్త మార్గాన్ని ఎంచుకుంది. బౌద్ధ సన్యాసిగా మారి పోయి అందర్నీ ఆశ్చర్య పరిచింది. ఆమెనే బాలీవుడ్ హీరోయిన్ బర్ఖా మదన్. ఆమె నటి మాత్రమే కాదు మాజీ ఇండియా కంటెస్టెంట్ కూడా.

నటి బర్ఖా మదన్ 1996 లో "ఖిలాడియోం కా ఖిలాడి" అనే చిత్రంతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ హీరో కాగా.. రేఖ హీరోయిన్. బర్ఖా మదన్ రెండో హీరోయిన్ పాత్రలో మెరిసింది. ఆ తర్వాత 2003 లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన భూత్ చిత్రంలో నటించి మెప్పించింది. ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారింది బర్ఖా మదన్. ఆ తర్వాత అతి తక్కువ సమయంలోనే దాదాపు 20 చిత్రాల్లో నటించింది. అలాగే పలు టీవీ షోల్లోనూ కనువిందు చేసింది.

RGV Heroine Shocks Fans Quits Films to Become Monk

కానీ నటి బర్ఖా మదన్ అన్నింటినీ వదిలి బౌద్ధ సన్యాసిగా మారింది. ఆమె పేరును వెన్. గ్యాల్టెన్ సామ్టెన్ గా మార్చుకుంది. ఇప్పుడు హిమాలయాల్లోని బౌద్ధ మఠాల్లో జీవనం సాగిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+