గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన సాయి పల్లవి.. ఆ మూవీ సీక్వెల్‌లో ఫిక్స్ !!

లేడీ పవర్ స్టార్ "సాయి పల్లవి" మరో బంపర్ ఆఫర్ అందుకుంది. దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. తన సహజమైన నటన, డ్యాన్స్ స్కిల్స్ తో సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. సౌత్‌లో ఇప్పటికే స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న ఆమె.. ఇప్పుడు బాలీవుడ్‌లో సైతం నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. గ్లామర్ షో కి దూరం ఉంటూ మంచి ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంటుంది. ఇప్పుడు లేటెస్ట్ గా ఈమెకు మరో అదిరిపోయే ఆఫర్ దక్కినట్టు తెలుస్తోంది.

ప్రభాస్ సరసన ఛాన్స్..

గ్లోబల్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం " కల్కి". నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. అమితాబ్ ముఖ్య పాత్రలో నటించగా.. దీపికా పదుకునే హీరోయిన్ గా చేసింది. ఈ చిత్రానికి నిర్మాతగా అశ్వనీదత్ వ్యవహరించారు. కాగా ఈ మూవీకి సీక్వెల్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే దీపిక పదుకొణె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టు గతేడాది అధికారికంగా ప్రకటించారు. దాంతో అప్పటి నుంచి ఆమె స్థానంలో నటించేది ఎవరని జోరుగా చర్చ నడుస్తోంది.

sai-pallavi-going-to-pair-with-pan-india-star-prabhas-in-kalki-movie-sequel-on-deepika-padukune-role

ఈ క్రమంలోనే ఆ పాత్రలో నటించేందుకు డైరెక్టర్ సాయి పల్లవిని సంప్రదించినట్లు సమాచారం. అందుకు సాయి పల్లవి కూడా సానుకూలంగా స్పందించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో త్వరలోనే అధికారికంగా ప్రకటన రావొచ్చని అంటున్నారు. దీంతో ఈ విషయం గనుక నిజమైతే ప్రభాస్‌ - సాయిపల్లవి జోడీని త్వరలోనే సిల్వర్ స్క్రీన్ పై చూడొచ్చని ఫ్యాన్స్ అంతా ఖుషి అవుతున్నారు. ఇక ఇప్పుడు నాగ్ అశ్విన్ ప్రీ ప్రొడక్షన్ వర్క్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడని.. ఈ వేసవి నుంచి షూటింగ్ మొదలవుతుందని భావిస్తున్నారు.

ఇకపోతే సాయి పల్లవి సినిమాలు విషయానికి వస్తే.. మలయాళంలో "ప్రేమమ్" సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో ఫిదా, ఎంసీఏ, పడి పడి లేచె మనసు, లవ్‌స్టోరీ, శ్యామ్ సింగరాయ్, విరాటపర్వం వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకుంది. ఇక రీసెంట్ గానే తమిళంలో శివకార్తికేయన్ సరసన నటించిన "అమరన్", తెలుగులో నాగచైతన్యతో "తండేల్" మంచి హిట్స్ గా నిలిచాయి.

ప్రస్తుతం సాయి పల్లవి నితీష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ "రామాయణ" లో ఆమె సీతదేవి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సుమారు రూ.1600 కోట్లు బడ్జెట్ కేటాయించగా, ఇది రెండు భాగాలుగా రూపొందుతుంది. ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, యష్ రావణుడిగా, కాజల్ అగర్వాల్ మండోదరిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా నటిస్తున్నారు. పలువురు బాలీవుడ్, దక్షిణాది స్టార్ నటీనటులు ముఖ్యపత్రాలు పోషిస్తున్నారు. మరోవైపు దిగ్గజ గాయని ఎమ్మెస్ సుబ్బలక్ష‍్మి బయోపిక్‌లోనూ.. అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్‌ సరసన "ఏక్ దిన్" అనే మూవీలో కూడా సాయి పల్లవి నటిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+