రూ. 100 కోట్ల మార్క్‌ను దాటేసిన సాయిపల్లవి సినిమా..
నేచురల్ బ్యూటీ సాయిపల్లవి, శివ కార్తికేయన్ హీరో, హీరోయిన్లుగా నటించిన అమరన్ చిత్రం రూ. 100కోట్ల మార్క్‌ను దాటేసింది. ఈ సినిమాకు రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఇండియన్ ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా తెరకెక్కిన సంగతి తెలిసిందే. అమరన్ సినిమాలో సాయి పల్లవి ఇందు రెబక్క వర్గీస్ పాత్రలో కనిపించారు. ఈ సినిమాల్లోని నటులు వారి వారి పాత్రల్లో జీవించేశారు. ఇక, శివకార్తికేయన్, సాయిపల్లవిల మధ్య ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందనే చెప్పుకోవాలి. రాజ్ కమల్ పతాకం పై కమల్ హాసన్, సోనీ పిచర్స్ కలిసి సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు.
దీపావళి కానుకగా విడుదలయిన అమరన్ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం ఒక్క తెలుగులో కాకుండా తమిళ్, మళయాళం భాషల్లో కూడా విడుదలై బ్లాక్ బస్టర్ అయింది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. విడుదలయిన మూడు రోజుల్లోనే రూ. 100కోట్ల క్లబ్‌లో చేరిపోయింది.

అమరన్ చిత్రం శనివారం మొదటి షో నుంచి హిట్ టాక్ తో దూసుకెళ్తుంది. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో హౌస్ ఫుల్స్ బోర్డ్స్ కనిపించాయి. దీపావళి పండుగను ఈ చిత్రం క్యాష్ చేసుకుందనే చెప్పాలి. ఇక, కేరళ, కన్నడ లోను వీకెండ్ బుకింగ్స్ పెరిగిపోతున్నాయి. తెలుగులో అమరన్ చిత్రం అంతగా ప్రమోట్ చేయకపోయినా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. తెలుగులో ఫిదా బ్యూటీకీ ఉన్న క్రేజీ ప్రభావం వసూళ్లలో కనిపిస్తుంది.












Click it and Unblock the Notifications