పహల్గాం ఉగ్రదాడిపై సల్మాన్ ఖాన్ సంచలన ట్వీట్

జమ్మూకశ్మీర్ అనంత్ నాగ్ జిల్లాలోని పెహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన మారణహోమంలో 28 మంది టూరిస్టులు మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఘటనను ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఇదో పిరికిపంద చర్యగా అభివర్ణించాయి. అటు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. త్వరలోనే ప్రపంచం ఆశ్చర్యపోయే విధంగా ఉగ్రమూకలకు బదులు చెప్తామని అన్నారు.

అటు సినిమా ఇండస్ట్రీ నుంచి అనేకమంది సెలబ్రిటీలు.. బాలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా ఉగ్రమూకల చర్యను తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబాలను ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. అయితే తాజాగా ఈ ఘటనపై బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ సంచలన ట్వీట్ చేశారు. ఇప్పటికే ఆయనకు అనేక వర్గాల నుంచి డెత్ త్రెట్స్ వస్తున్నాయి. చంపేస్తాం అంటూ బెదిరింపు కాల్స్ హల్ చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆయన చేసిన ట్వీట్ సర్వత్రా ఆసక్తిని రేపుతోంది.

Salman Khan Breaks Silence Slams Pahalgam Terror Attack in Powerful Tweet

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఈ ఘటనపై తన అధికారిక ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఉగ్రవాదుల దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. భూతల స్వర్గమైన కశ్మీర్ నరకంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అమాయకులను లక్ష్యంగా చేసుకుంటున్నారని అన్నారు. బాధిత కుటుంబాల కోసం తన హృదయం పశ్చాత్తాపపడుతోందని తెలిపారు. ఒక్క అమాయకుడిని చంపినా అది మొత్తం విశ్వాన్నే చంపిన దానితో సమానమని ఎమోషనల్ అయ్యారు. ఈ మేరకు పహల్గాం ఉగ్రదాడిని తాను ఖండిస్తున్నానని సల్మాన్ ఖాన్ పేర్కొన్నారు. ఆయన ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

ఇటీవల ఆయనకు వరుసగా బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేపిన విషయం తెలిసిందే. సల్మాన్ ఖాన్ కారులో బాంబ్ పెట్టి లేపేస్తామంటూ సంచలన కాల్స్ రావడం ఆయన్ను, ఫ్యాన్స్ ను తీవ్రంగా కలచివేసింది. ఈ క్రమంలోనే ఆయన ఉగ్రవాదుల ఘాతుకంపై ట్వీట్ చేయడం సర్వాత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు ఆయన ఇటీవల నటించిన సికందర్ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్లాఫ్ టాక్ తెచ్చుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+