జైల్లో ఉన్నప్పుడు హాయిగా నిద్రపోయా.. జైలు జీవితంపై బాలీవుడ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు..!
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తన మేనల్లుడు అర్హాన్ ఖాన్ తో కలిసి దంబ్ బిర్యానీ ఓ పోడ్ కాస్ట్ లో సల్మాన్ ఖాన్ పాల్గొన్నారు. ఇందులో సల్మాన్ తన జైలు జీవితం, వ్యక్తిగత జీవితం, వృత్తి జీవితంపై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
నేను సాధారణంగా రోజుకు 2 గంటలు నిద్రపోతా. ఎప్పుడో నెలకోసారి 7గంటలు నిద్రపోతా. షూటింగ్స్ టైమ్ లో ఐదు నిమిషాలు బ్రేక్ దొరికినా కుర్చీలోనే నిద్రపోతాను. సినిమా షూటింగ్స్ , ఖాళీగా ఉన్నప్పుడు చాలాసేపు నిద్రపోతా. జైలులో ఉన్నప్పుడు హాయిగా కావాల్సినంత సమయం నిద్రపోయా. జైలులో నాకు చేయడానికి పని లేదు. అందుకే నిద్రపోయోవాడ్ని " అని సల్మాన్ ఖాన్ చెప్పుకొచ్చారు. "చాలా మంది తాము అలసిపోయాం అని నిద్రపోతారు. కానీ మీరు ఎంత అలసిపోయినా ఎప్పుడూ నిద్రపోవద్దు. ఏదైనా పని చేయడం ప్రారంభించండి. అప్పుడు నిద్ర దానంతట అదే వస్తుంది." అని సల్మాన్ ఖాన్ వివరించారు.

సల్మాన్ ఖాన్ 1998లో కృష్ణ జింకల వేట కేసులో నిందితుడిగా ఉన్నాడు. 2006లో కోర్టు అతనికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. కానీ కొద్ది రోజుల్లోనే ఆయన బెయిల్ పై బయటకు వచ్చారు. 2018లో కోర్టు మరోసారి ఆయనకు శిక్ష ఖరారు చేసింది. అప్పుడు కూడా కొద్దిరోజులు జైలులో ఉండి బెయిల్ పై బయటకు వచ్చారు.
ప్రస్తుతం సల్మాన్ ఖాన్.. మురగదాస్ దర్శకత్వంలో సికిందర్ చిత్రం చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ ఏడాది రంజాన్ కానుకగా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందాన్న హీరోయిన్ గా నటిస్తోంది. సికిందర్ మూవీతో పాటు సల్మాన్ ఖాన్ మరో మూవీ కిక్-2 కూడా ఈ ఏడాదిలోనే రిలీజ్ కానున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications