ఎక్కడకు వెళ్లాలన్నా అతనితో కలిసి వెళుతున్న సమంత
దక్షిణాది బ్యూటీ సమంత దేశంలోనే నెంబర్ వన్ హీరోయిన్ గా చెలామణి అవుతోంది. నాగచైతన్యతో విడాకుల అనంతరం మయోసైటిస్ సోకడంతో చికిత్స తీసుకునేందుకు సినిమాలకు రెండు సంవత్సరాల విరామం ఇచ్చింది. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు రావడంలేదు. దీంతో వెబ్ సిరీస్ లు చేస్తోంది. అవి సూపర్ హిట్ అవుతున్నాయి. గత నవంబరులో హనీబన్నీ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత రక్త్ బ్రహ్మాండ్ అనే సిరీస్ చేస్తోంది. ప్రస్తుతం ఆమె హైదరాబాద్ లోకన్నా ముంబయిలోనే ఎక్కువగా నివసిస్తోంది. ఒకరకంగా హైదరాబాద్ రావడం తగ్గించేసిందని చెప్పొచ్చు.
ఆ పార్టీకి కూడా హాజరయ్యారు
ఫ్యామిలీమ్యాన్ సిరీస్ తోపాటు హనీబన్నీ సిరీస్ చేసే సమయలో ఇద్దరు దర్శకుల్లో ఒకరైన రాజ్ నిడుమోరుతో ఎక్కువ పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ఇప్పుడు ప్రేమగా మారిందని వార్తలు వస్తున్నాయి. రాజ్ అండ్ డీకేగా పేరు పొందిన దర్శక ద్వయంలో రాజ్ నిడుమోరు ఒకరు. ఆయన తెలుగువాడే. ఆయనతో కలిసి తరుచుగా కనిపిస్తున్నారు సమంత. ఇటీవలే ఓ పార్టీకి హాజరయ్యారు.

తర్వాత పికిల్ బాల్ స్పోర్ట్స్ ఈవెంట్ జరిగితే అక్కడకు కూడా జంటగానే వెళ్లారు. పికిల్ బాల్ చెన్నై జట్టుకు సమంత యజమాని. దీనితర్వాత ముంబయిలో జరిగిన ఓ వేడుకకు కూడా రాజ్ నిడుమోరు, సమంత కలిసి హాజరవడం సంచలనం కలిగిస్తోంది. వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోందంటున్నారు. ఈ కారణంగానే నాగచైతన్యతో విడిపోయారా? అనే సందేహాన్ని నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో వైరలవుతున్నారు
ప్రస్తుతం వీరిద్దరూ కలిసివున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. సమంత నటిస్తున్న రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్ దర్శకులు కూడా రాజ్ అండ్ డీకేనే. అయితే దీనిపై వీరిద్దరిలో ఒకరు స్పష్టత ఇస్తేనే వారు ప్రేమలో ఉన్నారా? లేదంటే కేవలం స్నేహమేనా? అనే విషయం తెలుస్తుంది. అప్పటివరకు ఎవరికి తూచినట్లు వారు మాట్లాడుకోవడమే. మా ఇంటి బంగారం పేరుతో సొంత బ్యానరులో సమంత ఓ సినిమా చేస్తోంది. ఇందులో ప్రియదర్శి హీరోగా నటిస్తున్నారు.












Click it and Unblock the Notifications