నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత వివాదంలో సమంత?

అక్కినేని నాగార్జున మాదాపూర్ లోని తుమ్మిడికుంట చెరువులో మూడున్నర ఎకరాలను ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ నిర్మించారు. ఇందులో ఆయన స్నేహితుడు నల్ల ప్రీతమ్ రెడ్డి కూడా భాగస్వామి. చెరువు భూమిని ఆక్రమించి నిర్మాణం చేయడంతో హైడ్రా అధికారులు కన్వెన్షన్ కేంద్రాన్ని కూల్చివేశారు. అన్నీ నిబంధనల ప్రకారమే కట్టానని నాగార్జున ట్వీట్ ద్వారా తెలిపారు. కూల్చివేతను ఆపాలంటూ హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. స్టే వచ్చేలోగానే అధికారులు కన్వెన్షన్ ను పూర్తిగా నేలమట్టం చేశారు. కోర్టు ఎటువంటి స్టే ఇవ్వలేదని ప్రభుత్వం చెబుతోంది.

ఆధారాలిచ్చిన మంత్రి కోమటిరెడ్డి
ఎన్ కన్వెన్షన్ ను తాకుతూ చెరువు నీళ్లు ఉంటాయి. ఆధారాలతో సహా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ఫిర్యాదు చేయడంతో అన్ని వివరాలు పరిశీలించిన తర్వాత అధికారులు కూల్చివేశారు. భారత రాష్ట్ర సమితి హయాంలో కూడా దీన్ని కూల్చివేయడానికి వెళ్లిన బుల్డోజర్లు కొంత సమయానికి వెనుతిరిగి వచ్చాయి. ఎన్ కన్వెన్షన్ పై చర్యలు తీసుకొని తుమ్మిడికుంట చెరువును గుర్తించాలంటూ 2014లో హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. అయితే అప్పటి మంత్రి కేటీఆర్ దీనిపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.

Samantha in Nagarjuna N convention demolition controversy

చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా సమంత
ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించిన విషయంలో పది సంవత్సరాల నుంచి కేటీఆర్ ఎందుకు మౌనంగా ఉండిపోయారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నిస్తున్నారు. ఆ తర్వాత నాగార్జున మాజీ కోడలు సమంతను తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారని, దీనివెనక ఉన్న ఆంతర్యం ఏమిటో చెప్పాలంటూ ఆయన డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఎన్ కన్వెన్షన్ వివాదంలోకి సమంతను కూడా లాగినట్లైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు.. ఇలా ఎవరినీ వదిలిపెట్టేది లేదని, అక్రమమని తేలితే కూల్చివేత తప్పదని, నోటీసులు ఉండవని, నేరుగా కూల్చివేయడం జరుగుతుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+