సమంతను వెంటాడుతున్న 'అక్టోబరు'!

దక్షిణాది బ్యూటీక్వీన్ సమంతను అక్టోబరు నెల వెంటాడుతోంది. ఆమె జీవితంలో చోటుచేసుకుంటున్న కీలక సంఘటనలు, కీలక సందర్భాలన్నీ అక్టోబరు నెలలోనే జరుగుతున్నాయి. అసలు ఏ ముహూర్తాన విడాకులు తీసుకుందోకానీ అప్పటినుంచి ఆమెను వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇప్పటికీ వదలడలేదు. 2017 అక్టోబరు నెలలో నాగచైతన్యను సమంత వివాహం చేసుకుంది. నాలగు సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత 2022 అక్టోబరు నెలలో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి సినీ పరిశ్రమకు, తెలుగు ప్రేక్షకులకు తీవ్ర షాక్ ఇచ్చారు.

అడ్వాన్స్ తిరిగిచ్చేసింది
ఆ సమయంలో సామాజిక మాధ్యమాల్లో సమంతపైనే తీవ్రస్థాయిలో వ్యతిరేకంగా ట్రోలింగ్ జరిగింది. ఆ తర్వాత తనకు మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి సోకిందని 2022 అక్టోబరు నెలలోనే ప్రకటించింది. ఆ సమయంలో కూడా సానుభూతి కోసం నాటకం ఆడుతోందంటూ ట్రోలింగ్ చేశారు. ఆ తర్వాత ఏడాదిన్నర సమయం సినిమాలకు దూరంగా ఉంది. అప్పటివరకు తాను నిర్మాతల దగ్గర తీసుకున్న అడ్వాన్స్ డబ్బులను కూడా తిరిగిచ్చేసింది. ఈ విషయం మాత్రం ట్రోలర్స్ కు కనపడలేదు.

Samantha is facing important controversies in every october month

వివాదాలతో సావాసం
పుష్ప సినిమాలో ఊ అంటావా మావా ప్రత్యేక గీతంలో నర్తించింది. ఈ పాట అప్పట్లో పెద్ద సంచలనం కలిగించగా, సమంత చేయడం అంతకన్నా పెద్ద సంచలనం కలిగించింది. విడాకుల తర్వాత చేసిన పాట కావడంతో ఇలాంటి బోల్డ్ పాత్రలు చేయడానికి అక్కినేని కుటుంబం అంగీకరించలేదని, అందుకే విడిపోయారంటూ ట్రోలింగ్ జరిగింది. ఆ తర్వాత రూ.250 కోట్ల భరణం అడిగిందంటూ వార్తలు వచ్చాయి. కాఫీ విత్ కరణ్ షోలో ఆ ప్రశ్న ఎదురవగా సమంత ఆ వార్తలను కొట్టేసింది. అలాగే మయోసైటిస్ చికిత్స కోసం స్టార్ హీరో దగ్గర రూ.25 కోట్లు అప్పుగా తీసుకుందంటూ వార్తలు రాగా సోషల్ మీడియాలో ఈ విషయాన్ని సమంత కొట్టిపారేసింది. తాజాగా ఈ ఏడాది అక్టోబరు నెలలో మంత్రి కొండా సురేఖ కేటీఆర్ పై వ్యాఖ్యలు చేస్తూ సమంత పేరును, అక్కినేని కుటుంబాన్ని బయటకు లాగింది. ఇలా విడాకులు తీసుకున్నప్పటి నుంచి నిత్యం ఆమెను వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. బ్యాడ్ లక్ సమంత అంటూ నెటిజన్లు సానుభూతిని తెలియజేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+