సర్ ప్రైజ్ ఇచ్చిన సమంత "మా ఇంటి బంగారం" టీం..
స్టార్ బ్యూటీ సమంత నటించిన లేటెస్ట్ మూవీ 'మా ఇంటి బంగారం'. ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహించగా.. సామ్ భర్త, ప్రముఖ డైరెక్టర్ రాజ్ నిడిమోరు కథ, స్క్రీన్ ప్లే సమకూర్చారు. కాగా రిలీజ్‌కు ముందే భారీ అంచనాలు నెలకొల్పిన సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాన్ని అందుకుంది. ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్, కామెడీ, హృద్యమైన కథాంశం కలగలిసిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం మంచి కలెక్షన్లతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.
కాగా మూవీ విజయాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం విశాఖపట్నంలో ఘనంగా సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ వేడుకలో ప్రేక్షకులకు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చారు రాజ్ నిడిమోరు. వేదికపై మాట్లాడిన ఆయన ముందుగా అభిమానులను ఉద్దేశించి "మా ఇంటి బంగారం 2 కావాలా?" అని ప్రశ్నించారు. దీనికి అక్కడున్న అభిమానులు హర్షధ్వానాలు, చప్పట్లతో స్పందించడంతో ఆ ఆనందాన్ని పంచుకుంటూ 'మా ఇంటి బంగారం 2' తెరకెక్కనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

ఈ మేరకు రాజ్ నిడిమోరు మాట్లాడుతూ.. రెండో భాగానికి సంబంధించిన ఆలోచన ఇప్పటికే సిద్ధంగా ఉందని తెలిపారు. మొదటి భాగాన్ని రూపొందించిన అదే టీమ్ ఈ సీక్వెల్‌ను కూడా రూపొందిస్తుందని చెప్పారు. కథను మరింత ఆసక్తికరంగా తీర్చిదిద్దుతున్నామని.. మొదటి భాగం కంటే ఎక్కువ వినోదం, మరిన్ని సర్‌ప్రైజ్‌లతో ప్రేక్షకులను అలరించేలా స్క్రిప్ట్ సిద్ధమవుతోందని వెల్లడించారు. వచ్చే రెండేళ్లలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే లక్ష్యమని కూడా తెలిపారు.
ఇక ఇటీవలి కాలంలో భారతీయ సినీ పరిశ్రమలో సీక్వెల్‌ల ట్రెండ్ మరింత బలపడుతోంది. ప్రేక్షకులు ఆదరించిన కథలను, పాత్రలను మరోసారి కొత్త మలుపులతో తెరపైకి తీసుకురావడంపై దర్శక నిర్మాతలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. బాహుబలి, కేజీఎఫ్, పుష్ప, కాంతార వంటి చిత్రాల తర్వాత సీక్వెల్‌లపై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. అదే తరహాలో 'మా ఇంటి బంగారం 2' కూడా భారీ అంచనాలతో రూపొందనుంది.
#MaaIntiBangaaram SEQUEL ANNOUNCED at the Success Meet in Vizag 💥💥💥💥
— Duddi Sreenu (@PRDuddiSreenu) June 26, 2026
Book your tickets now!
🎟️ https://t.co/YhsGMjgdkP@TralalaPictures @Samanthaprabhu2 #RajNidimoru #NandiniReddy @himankd @gulshandevaiah @diganthmanchale @gautamitads @VasanthMaringa1 @MukhiSree… pic.twitter.com/O45JTbfRdw












Click it and Unblock the Notifications