నాగచైతన్యకు లీగల్ నోటీసులు పంపించిన సమంత?
నాగచైతన్య-సమంత జంట గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చుకున్నారు ఈ జంట. అయితే మనస్పర్థల వల్ల విడిపోయినప్పటికీ వీరిద్దరికి సంబంధించి సోషల్ మీడియాలో ఏ వార్త వచ్చినా అది వైరలవుతోంది. వీరిద్దరూ పెళ్లి చేసుకున్న సమయంకన్నా, విడిపోయిన తర్వాతే ఎక్కువ పాపులారిటీని దక్కించుకుంటున్నారు. ఆగస్టు ఎనిమిదో తేదీన శోభిత ధూళిపాళతో నాగచైతన్య నిశ్చితార్థం జరుపుకున్న సంగతి తెలిసిందే. పసుపు దంచే పనులు ప్రారంభమైనట్లు శోభిత ఫొటోలను షేర్ చేసింది. దీంతో పెళ్లి తేదీ కూడా దగ్గరలోనే ఉందని అనుకుంటున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలో నాగచైతన్యకు సమంత షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఎక్కువ ఖర్చుచేసిన సమంత
నాగచైతన్య-సమంత.. ఇద్దరూ కలిసి ఓ ఫ్లాట్ ను కొనుగోలు చేసి అందులో కాపురం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఫ్లాట్ ను కొనుగోలు చేసే సమయంలో నాగచైతన్యకన్నా తానే ఎక్కువ ఖర్చుపెట్టానని సమంత చెబుతోంది. దీనికి సంబంధించిన అన్ని ఆధారాలను కోర్టుకు సమర్పించి ఆ తర్వాత చైతూకు లీగల్ నోటీసులు పంపించబోతోంది. దీనికి కారణం ఏమిటంటే.. శోభితతో వివాహైన తర్వాత ఆ ఫ్లాట్ లోనే కాపురం ఉందామని నాగచైతన్య చెప్పాడు. అయితే శోభిత అందుకు ఒప్పుకోలేదు. అందులో ఉండటంవల్ల పదే పదే పాత భార్య జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయని, వేరే ఫ్లాట్ లో ఉందామని చెప్పింది. అయితే నాగచైతన్య మాత్రం అందులోనే ఉందామని, ఎంతో ఇష్టపడి ఇంటీరియర్ చేయించానని చెప్పడంతో ఈ విషయంలో నాగచైతన్య, శోభిత మధ్య చిన్న మనస్పర్థ చోటుచేసుకున్నట్లు వార్తలు వచ్చాయి.

వేరేవారికి ఇస్తానంటే ఎలా?
నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత ఆ ఫ్లాట్ ఖాళీగా ఉంది. ఎవరింటికి వారు వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆ ఫ్లాట్ ను శోభిత ధూళిపాలకు గిఫ్ట్ గా రాయాలని నాగచైతన్య భావిస్తున్నట్లు తెలుస్తోంది. తాను అధికంగా ఖర్చుపెట్టిన ఫ్లాట్ ను వేరేవారికి బహుమతిగా రాసిస్తానంటే ఎలా ఒప్పుకుంటానని సమంత తన సన్నిహితులతో అన్నట్లు సమాచారం. ఈ విషయంపై స్పందించిన నెటిజన్లు కూడా ఇద్దరూ కలిసి కొనుగోలు చేసిన ఫ్లాట్ ను శోభితకు ఎలా రాస్తావంటూ చైతూపై మండిపడుతున్నారు. ఒకరి అభిప్రాయాలు మరొకరు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ వార్తలో వాస్తవమెంతో తెలియదుకానీ సామాజిక మాధ్యమాల్లో తీవ్రంగా వైరలవుతోంది.












Click it and Unblock the Notifications