మరో వ్యాధితో బాధపడుతున్న సమంత
హీరోయిన్ సమంత జీవితం తెరిచిన పుస్తకమే. ఆమె సినీ జీవితం దగ్గర నుంచి వ్యక్తిగత జీవితం వరకూ అన్ని విషయాలు అందరికి తెలిసినవే. తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన సమంత .. హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నాగ చైతన్య, సమంతలు 2017లో వివాహం చేసుకున్నారు. అయితే కొన్నాళ్లకే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఈ జంట అక్టోబర్ 2021లో విడిపోతున్నట్లు ప్రకటించారు. ఇండస్ట్రీలో బెస్ట్ జోడిగా ఉంటారనుకునేలోపే వీరు విడిపోయారు. పెళ్లైన కొన్నాళ్లకే వీరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. సమంత ప్రస్తుతం ఒంటరికి ఉంటున్నారు.

సమంతతో విడాకులు తర్వాత నాగ చైతన్య తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నాగ చైతన్యతో విడాకులు అనంతరం సమంత చాలా ఇబ్బందులను ఫేస్ చేసింది. మయసైటీస్ వ్యాధి కారణంగా కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న సమంత, ప్రస్తుతం వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ముఖ్యంగా నాగచైత్యన్యతో విడిపోయిన తర్వాత చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తుందామె. ఈక్రమంలోనే బాలీవుడ్ 'సిటాడెల్ (హనీ, బన్నీ)' అనే వెబ్ సిరీస్‌లో నటించారు.

ఈ వెబ్ సిరీస్‌లో వరుణ్ ధావన్ హీరోగా నటించాడు. తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే తాజాగా సమంత తన ఆరోగ్యంపై చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. 'చికెన్ గున్యా వల్ల వచ్చిన కీళ్లనొప్పులు నుంచి కోలుకోవడం అనేది చాలా ఫన్‌గా ఉంటాయి' అని రాసుకొచ్చింది. దీంతో పాటు తాను జిమ్‌లో కష్టపడుతున్న ఫొటోను తన స్టోరీకి జత చేసింది. దీంతో సమంత చికెన్ గున్యా వ్యాధి బారిన పడ్డారని అంతా భావిస్తున్నారు. సమంత చేసిన ఈ పోస్ట్‌ను చూసిన నెటిజన్లు, ఫ్యాన్స్ ఆందోళన చెందుతూ, ఆమె త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications