కూతురితో రొమాంటిక్ సినిమా చేస్తున్న తెలుగు స్టార్ హీరో

యాక్షన్ కింగ్ అర్జున్ తన దర్శకత్వ ప్రతిభతో మరో అద్భుతమైన దృశ్యకావ్యాన్ని సిద్ధం చేశారు. తన గారాల పట్టి ఐశ్వర్య అర్జున్‌ను వెండితెరకు పరిచయం చేస్తూ ఆయన తెరకెక్కించిన 'సీతా పయనం' చిత్రం ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై మల్టీ టాలెంటెడ్ స్టార్ అర్జున్ సర్జా దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం 'సీతా పయనం'. ప్రేమ, కుటుంబ విలువలు మరియు భావోద్వేగాల మేళవింపుగా రూపొందిన ఈ చిత్రం, ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఈ సినిమా ద్వారా యాక్షన్ కింగ్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ హీరోయిన్‌గా పరిచయం అవుతుండటం విశేషం. ఆమెతో పాటు ఈ చిత్రంలో.. నిరంజన్ హీరోగా నటిస్తుండగా.. సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషించారు. స్వయంగా అర్జున్ ఒక ప్రత్యేక పాత్రలో మెరవనుండగా, ఆయన మేనల్లుడు యాక్షన్ ప్రిన్స్ ధ్రువ సర్జా మాస్ కామియో రోల్‌లో కనిపించి ప్రేక్షకులను అలరించనున్నారు.

Seetha Payanam Movie Release Action King Arjun s Daughter Aishwarya Arjun Debut on Feb 14

పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలకు సోషల్ మీడియాలో విశేష స్పందన లభిస్తోంది. ముఖ్యంగా సాయి మాధవ్ బుర్రా అందించిన మాటలు, జి. బాలమురుగన్ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధాన బలంగా నిలవనున్నాయి. యాక్షన్ కింగ్ సినిమా అంటే ఉండాల్సిన అద్భుతమైన స్టంట్ సీక్వెన్స్‌లను 'కిక్ యాస్ కాళీ' అద్భుతంగా కంపోజ్ చేశారు.

ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం క్లీన్ పాజిటివ్ బజ్‌ను సంపాదించుకుంది. కేవలం ప్రేమకథ మాత్రమే కాకుండా, ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా అర్జున్ ఈ చిత్రాన్ని మలిచారు. త్వరలోనే ఈ సినిమా ట్రైలర్‌ను గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+